శ్రీ ఈశ్వరకృత శ్రీ నరసింహస్తుతిః
నమస్తేస్తు జగన్నాథ నరపసింహవపుర్హరే | దైత్యనాధాసృజాపూర్ణనఖశ (పం)క్తివిరాజిత. 54
జగత్సకలంసంలగ్న హేమపిజ్గళవిగ్రహ | నతో೭స్మి పద్మనాభ త్వాం సురశక్రజగద్గురో. 55
కల్పాన్తామ్భోద(ధి) నిర్ఘోష సూర్యకోటిసమప్రభ | సహస్రపరమక్రోధ సహస్రేన్ద్రపరాక్రమ. 56
సహస్రవదనస్ఫీత సహస్రచరణాత్మక | సహస్రకాలరచిత సహస్రనియతేన్ద్రియ. 57
సహస్రభూమిసద్దైర్య సహస్రానన్తమూ ర్తిమ9 | సహస్రచన్ద్రప్రతిమ సహస్రగ్రహవిక్రమ 58
సహస్రరుద్రతేజస్క సహస్రబ్రహ్మసంస్తుత | సహస్రవాయువేగోగ్ర సహస్రాక్షనిరీక్షణ. 59
సహస్రయన్త్రమథన సహస్రబన్ధమోచక | అన్దకస్య వినాశాయ యా స్సృష్టా మాతరో మయా. 60
జగన్నాథా | నృసింహదేవాధారిన్ ! హరీ! (పాపముల హరించువాడా!) దైత్యనాథుని రక్తముతో నిండిన గోళ్ళు అనెడు శక్త్యాయుధములు కలవాడా! నీకు నమస్కారము. సకల జగమునందును వ్యాపించిన బంగారువంటి పచ్చనిమూర్తి కలవాడా! ప్రళయకాల మేఘ ధ్వనివంటి నాదము కలవాడా! పద్మనాభా! దేవతలకును ఇంద్రునకును సమస్త జగత్తునకును తండ్రీ ! సహస్ర విధములగు మహాక్రోధము గలవాడా! సహస్రేందులంత పరాక్రమము కలవాడా! సహస్ర ముఖముల సమృద్ధి కలవాడా! సహస్రపాదా! సహస్రకాలముల రచించువాడా! సహస్ర సంఖ్యాకములగు ఇంద్రియములును నిగ్రహించువాడా! సహస్ర భూలోకములకును మంచి ధైర్యము నొసంగువాడా! వేలుకొలదిగా అనంతమూర్తులు కలవాడా! సహస్ర చంద్ర సమానా! సహస్రగ్రహ విక్రమా; సహస్ర రుద్ర సమాన తేజశ్శాలీ! సహస్ర బ్రహ్మ పరిస్తుతా! సహస్ర వాయువేగ భయంకరా ! సహస్ర నేత్రములతో చూచువాడా! వేలకొదలిగా యంత్రములను మథించువాడా! సహస్ర బంధనములనయిన విడిపించువాడా! నిన్ను నమస్కరించుచున్నాను.
శ్రీ మత్స్య మహాపురాణమున అంధకాసుర వధము- రౌద్ర- నారసింహ- మాతృకోత్పత్తియను నూట డెబ్బది ఎనిమిదవ అధ్యాయము నుండి.

No comments:
Post a Comment