బ్రహ్మాదీదేవకృత శ్రీ నృసింహస్తుతిః
బ్రహ్మా: భవాన్బ్రహ్మాచ రుద్రశచ మహేన్ద్రో దేవసత్తమః. 99
భవాన్కర్తావికర్తాచ లోకానాం ప్రభవో7వ్యయః l పరంచ సిద్ధంచ పరంచ దేవం పరంచ మన్త్రం పరమం హవిశ్చ. 100
వరంచ ధర్మం పరమంచ విశ్వం త్వామాహురగ్య్రం పురుషంపురాణమ్ l పరంచ సత్యం పంమం తపశ్చ పరం పవిత్రం పరమంచ మార్గమ్. 101
పరంచ యజ్ఞం పరమంచ హోత్రం త్వామాహురగ్య్రం పురుషం పురాణమ్ l పరం శరీరం పరమంచ బ్రహ్మపరంచ యోగం పరమాంచ వాణీమ్. 102
పరం రహస్యం పరమాం గతించ త్వామాహురగ్ర్యంపురుషం పురాణమ్ l పరం పరస్యాపి పరం పదం యత్. 103
పరం పరస్యాపి పరంచ హృద్యం త్వామాహుర గ్య్రం పురుషం పురాణమ్ l ఏవం పరసగాపి పరం పదం యత్పరం పరస్యాపి పరంచ పదేవమ్. 104
పరం పరస్యాపి పరంచ భూతం త్వామాహురగ్య్రం పురుషం పురాణమ్ l పరం పరస్యాపి వరం నిదానం పరం పరస్యాపి వరం పవిత్రమ్. 105
పరం పరస్యాపి పరం దాన్తం త్వామాహుర గ్య్రం పురుషం పురాణమ్ lఏముక్త్వాతుభవాన్త్సర్వలోకపితామహః . 106
బ్రహ్మ ఆ నరసింహు నిట్లు స్తుతించెను: బ్రహ్మరుద్రుడు దేవసత్తముడగు మహేంద్రుడు లోకములకు కర్తయు వికర్తయు( పరిణామము నొందించువాడు- లయము నొందించువాడు) కారణభుతుడును నయియుండియు తాను ఏ మార్పును లేకయుండు తత్త్వము నీవే. వరుడు (ఉత్కృష్టుడు) అగు సిద్ధుడు పరదేవుడు పరమంత్రము పరమ హవిస్సు (దేవతల నుద్దేశించి అగ్నిలో అర్పించు ద్రవ్యము) పరమ ధర్మము పరమ పరమ విశ్వము పంను సత్యము పరమ తవము పరమ పవిత్రము పరము మార్గము (మోక్ష సాధనము ) పరమ యజ్ఞము పరమహోత్రము (హోమ పాధనము) పరమ శరీరము పరమ బ్రహ్మము పరమ యోగము పరమ వాణి (వాక్కు) పరమ రహస్యము పరమ గతి (మోక్షము) పరమము కంటెపరమమగు రహస్యము పరమ పరమపదము (స్థానము) పరమ పరమహృద్యము (ప్రీతికంమగు తత్త్వము (పరమ పరమదేవుడు పరమ పరమభూతము పరమ పరమ నిదానము (అది కారణము) పరమ పరమ పవిత్రము పరమపరమ దాంతము (అన్నిటిని అణుచునది) నీవేయని తత్త్వవేత్తలు చెప్పుచున్నారు.
శ్రీ మత్స్య మహా పూరాణమును హిరణ్యకశిపూపాఖ్యానమున నరసింహుడు హిరణ్యకశిపుని విధించుటయను నూట అరువది రెండవ అధ్యాయము నుండి.

No comments:
Post a Comment