Monday, March 30, 2020

అదితికృత వాసుదేవ స్తుతిః.

అదితికృత వాసుదేవ స్తుతిః


నమస్స్మృతార్తినాశాయ నమః పుష్కరమాలినే. 13
నమః పరమకల్యాణి కల్యాణాయా దివేధసే| నమః వఙ్కజనేత్రాయ నమః పహ్కజనాభయే. 14
నమః పఙ్కజనమ్భూతి సమ్భవాయాత్మయోనయో| కాన్తాయ దాన్తదృశ్యాయ పరమార్థా చక్రిణ. 15
నమ శ్శఙ్ఖాసిహస్తాయ నమః కనకరేతసే| తథా త్మజ్ఞాన విజ్ఞానయోగినా చిన్త్యాత్మయోగినే. 16
నిర్గుణాయ విశేషాయ హరయే బహ్రహ్మరూపిణ| జగత్ప్రతిష్ఠితం యత్ర జగతా యో న దృస్యతే. 17
నమస్థ్సూ లాతిసూక్ష్మాయ తసై#్మ దేవాయ శఙ్కినే| యం న పశ్యన్తి పస్యన్తో జగదప్యఖిలం నరాః. 18
అపశ్యద్భి ర్జగద్చయత్ర దృశ్యతే హృది సంస్థితః| యస్మన్నన్నం పయశైవ సద్యశ్చైవాఖిలం జగత్‌. 19
తసై#్మ నమోస్తు జగతా మాధారాయ నమోనమః| ఆద్యః ప్రజారపతి ర్యశ్చ యః పితౄణాం పరః పతిః. 20
పతిస్సురాణాం యస్త సై#్మ నమః కృష్ణాయ వేధసే| యః ప్రవృత్తౌ నివృత్తౌ చ ఇజ్యతే కర్మభి స్స్వకై. 21
స్వర్గాపవర్గఫలదో నమ స్తసై#్మ గదాభృతే | యశ్చిన్త్యమానో మనసా సద్యః పాపం వ్యపోహతి. 22
నమస్తసై#్మ విశుద్ధాయపరాయ హరిమేధసే| యం బుధ్ధ్వా సర్వబూతాని దేవదేవేశ మవ్యయమ్‌. 23
న పునర్జన్మమరణ ప్రాప్నువన్తి నమామి తమ్‌| యో యజ్ఞే యజ్ఞపరమై రిజ్యతే యజ్ఞసంజ్ఞితః. 24
తం యజ్ఞపురుషం విష్ణుం నమామి ప్రభు మీశ్వరమ్‌|
స్మరించిన వారి ఆర్తి నశింపజేయువాడును పద్మమాలియు పరమ కల్యాణి కల్యాణుడును ఆది బ్రహ్మరూపుడును పంకజనేత్రుడును పంకజనాభుడును పద్మసంభవుని జన్మకారణుడును ఆత్మయోనియు మనోహర రూపుడును ఇంద్రియ నిగ్రహము కలవాడును దృస్య జగద్రూపుడు పరమార్థ రూపుడు చక్రియు శంఖ ఖడ్గహస్తుడు హరిణ్యరేతస్కుడు ఆత్మ జ్ఞానముగల యోగులచే చింతింపడువాడు స్వయం యోగియు నిర్గుణుడు విశేష రూపుడు హరియు పరబ్రహ్మరూపుడు నగు హరికి నమస్కారము. ఎవనియందు జగము ప్రతిష్ఠితమో జగమునకు ఎవడు కనబడడో అట్టి అతి సూక్ష్మునకు అతి స్థూలునకు శంఖికి నమస్కారము; అఖిల జగమును చూచుచుండియు బహిర్ముఖలగు జనులెవనిని చూడజాలరో ఇందుండియు ఈ జగమును బహిర్ముఖ దృష్టితో చూడని యోగులు ఎవనిని తమ హృదయముందేయున్న వానిగా చూతురో ఎవనియందన్నము జలము నదులు సమస్త జగములు ఉన్నదో అట్టి జగదాధారునకు నమస్కారము; ఆద్య ప్రజాపతియు పితరులకును పరమపతి(పిత) యు దేవతాపతియునగు కృష్ణునకు వేదో (చతుర్ముఖ బ్రహ్మ) రూపునకు నమస్కారము. ఎవడు ప్రవృత్తి మార్గములందాయా కర్మములతే ఆరాధింపడునో అట్టి స్వర్గాపవర్గ ఫరదుడగు గదాధారికి నమస్కారము; మనస్సుతో చింతించినంతనే పాపము హరించు విశుద్ధుడు పరుడునగు హరికి వేధకు (సృష్టికర్తకు) నమస్సు; సర్వభూతములును దేవదేవేశుడు నవ్యయుడునగు ఎవని నెరిగినంతనే జన్మ మరణరహితులగుదురో(నో) ఆ హరిని నమస్కరింతును; యజ్ఞ పరాయణులు యజ్ఞమందు ఎవనిని యజ్ఞుడను పేర ఆరాధింతురో అట్టి యజ్ఞపురుషుని విష్ణుని ప్రభుని ఈశ్వరుని నమస్కరింతును.
గీయతే సర్వవేదేషు వేదవిద్భి ర్విదాంపతిః. 25
యస్తసై#్మ వేదవేద్యాయ విష్ణవే జిష్ణవే నమః| యతో విశ్వం సముత్పన్నం యస్మింశ్చ లయ మేష్యతి. 26
విశ్వోద్భవప్రతిష్ఠాయ సమస్తసై#్మ మహాత్మనే| బ్రహ్మాది స్తమ్బపర్యన్తం యేన విశ్వమిదం తతమ్‌. 27
మాయాజాలం సముత్తర్తుం తముపేన్ద్రం న మా మ్యహమ్‌| విషాదతోషరోషాద్యైర్యో జస్రం సుఖదుఃఖజైః. 28
నృత్యత్యఖిలభూతస్థ స్తముపేన్ద్రం నమా మ్యహమ్‌| యమారాధ్య విశుద్ధేన కర్మణా మనసా గిరా. 29
తరస్త్యవిద్యా మఖిలాం తముపేన్ద్రం నమా మ్యహమ్‌| యస్త్సుతో విశ్వరూపస్థో బిభర్త్యఖిల మీశ్వరః. 30
విశ్వం విశ్వపతిం విష్ణుం తం నమామి ప్రజాపతిమ్‌| మూర్త న్తమో సురమయం
తద్వధాద్వినిహన్తి యః. 31
రాత్రిజం సూర్యరూపీవ తముపేన్ద్రం నమా మ్యహమ్‌| కపిలాదజి స్వరూపస్థో యశ్చాజ్ఞానయమం తమః. 32
హన్తి జ్ఞానప్రదానేన తముపేన్ద్రం నమా మ్యహమ్‌| యస్యాక్షిణీ తన్ద్రసూర్యౌ సర్వలోక శుభఙ్కరమ్‌. 33
వస్యతః కర్మ సతతం తముపేన్ద్రం నమా మ్యహమ్‌| యస్మిన్త్సర్వేశ్వరే విశేవం సత్య మేతన్మయోదితమ్‌. 34
నానృతం త మజం విష్ణుం నమామి ప్రబు మవ్యయమ్‌| యథైత త్సత్యముక్తంచ భూయాంశ్చాతో జనార్దనః. 35
సత్యేన తేన సఫలాః పూర్యన్తాం మే మనోరథాః.
సర్వజ్ఞుడగు ఎవడు వేదవేత్తలచే సర్వ వేదములందును గానము చేయబడునో వేదవేద్యుడగు అట్టి విష్ణునకు జిష్ణునకు నమస్కారము; ఎవనినుండి విశ్వముత్పన్నమయి ఎవనియందు లయమందునో విశ్వపురాకకు నిలుకడకు కారణ భూతుడగు అట్టి మహాత్మునకు నమస్కారము; బ్రహ్మాది స్తంబ పర్యంతమగు ఈ విశ్వమేవనిచే వ్యాప్తమో అట్టి యుపేంద్రుని నేను ఈ మాయాజాలము తరించుటకై నమస్కరింతును; తోయ స్వరూపుడై యుండి అఖిలమును పోషించు విశ్వుని విశ్వపతిని ప్రజాపతిని విష్ణుని నమస్కరింతును; సుఖదుఃఖములకు హేతువులగు విషాద సంతోష రోషాదులకు అజేయుడును అఖిల భూతాంతర్యామియయి వర్తించువాడు నగు ఉపేంద్రునకు వందనము ;రాత్రులందేర్పుడు చీకటిని రవివలె అసురమయమగు రూపొందిన చీకటిని వదించి నశింపచేయు ఉపేంద్రుని నమస్కరింతును ;కపిలాది యోగి స్వరూపమునుండి అజ్ఞానమయతమమున జ్ఞాన ప్రకాశ ప్రదానమున నశింపజేయు హరిని నమస్కరింతునుఎవని నేత్రములగు చంద్రసూర్యులు సర్వలోక శుభకరమగు కర్మమున సతతము చూచుచున్నారో అట్టి యుపేంద్రుని నమస్కరింతును; సర్వేశ్వరుడును సర్వుడునునగు ఎవనియందు నేను చెప్పిన ఇది యంతయు సత్యమో అసత్యము కాదో అట్టి అజుని విష్ణుని ప్రభుని అవ్యముని నమస్కరింతునునేను చెప్పిన ఇదియంతయు సత్యము కావునను జనార్ధనుడింతకంటెను అధికుడు కావునను ఈ సత్యముచే నా మనోరథములన్నియు సఫలములయి పూరింపపడుగాక !

శ్రీ మత్స్య మహాపురాణమున వామన చరితమున అదితి గర్భముందు హరిప్రవేశమను రెండు వందల నలువది మూడవ అధ్యాయము నుండి.

No comments:

Post a Comment