ప్రహ్లాద చెప్పిన శ్రీ విష్ణుమహిమా
తేజసో హాని రుత్పన్నా తచ్ఛృణుష్య యథార్థతః | దేవదేవో జగద్యోని రయోని ర్జగదాదికృత్. 17
అనాది రాదిర్విశ్వస్య వరేణ్యో వరదో హరిః | పరమ్పరాణాం పరమం పరః పరవతామపి. 18
ప్రమాణంచ ప్రమాణానాం సప్తలోకగురో ర్గురుః |
ప్రభుః ప్రభూణాం పరమే మహాత్మా అనాదిమధ్యో భగవా ననన్తః. 19
త్రైలోక్య మంశేన సనాథ మేష కర్తుం మహాత్మా7దితిజో7వతీర్ణః |
న యస్య రుద్రో న చ పద్మయోని రిన్ద్రో న సూర్యేన్దు మరీచిముఖ్యాః. 20
జానన్తి దైత్యాధిప యత్స్వరూపం స వాసుదేవః కలయా7వతీర్ణః |
యో7సౌ కలాంశేన నృసింహరూపీ జఘాన పూర్వం పితరం మమేశః 21
య స్సర్వయోగీశమనోనివాస స్స వాసుదేవః కలయా7వతీర్ణః |
యమక్షరం వేదవిదో విదిత్వా విశన్తి యం జ్ఞానవిధూతపాపాః. 22
యస్మి న్ప్రవిష్టా న పునర్భవన్తి తం వాసుదేవం ప్రణమామి నిత్యమ్ |
భూతా న్యశేషాణి యతో భవన్తి యథోర్మయ స్తోయనిధే రజస్రమ్. 23
లయం చ యస్మి న్ప్రళ##యే ప్రయాన్తిం తం వాసుదేవం ప్రణమామ్యజస్రమ్ |
న యస్య రూపం న బలప్రభావౌ న యస్య భావః పరమస్య పుంసః. 24
విజ్ఞాయతే శర్వపితామహాద్యై స్తం వాసుదేవం ప్రణమామ్యజస్రమ్ |
రూపస్య చక్షుర్గ్రహణ త్వగిష్టా స్పర్శే గ్రహిత్రీ రసవా రసస్య. 25
శ్రోత్రంచ శబ్దగ్రహణ నరాణాం ఘ్రాణంచ గన్ధగ్రహణ నియుక్తమే | సఘ్రాణగ్రాహ్యశ్శ్రవణాదిభి ర్య స్సర్వేశ్వరో వేదితు మక్షయాత్మా. 26
శక్య స్త మీడ్యం మనసైవ దేవం గ్రాహ్యం తతో7హం హరి మీశితారమ్| యేనైకదంష్ట్రాగ్ర సముద్ధృతేయం ధరా చ తాం ధారయతీహ సర్వా& . 27
యస్మింశ్చ శేతే సకలం జగచ్ఛ తమాద్యమీశం ప్రమతో7స్మి విష్ణుమ్ |
అంశావతీర్ణేన చ యేన గర్భే హృతాని తేజాంసి మహాసురాణామ్. 28
నమామి తం దేవ మజస్ర మీశ మశేషసంసారతరోః కుఠారమ్ |
దేవో జగద్యోని రయం మహాత్మా స షోడశాంశేన మహాసురేన్ద్ర.29
స దేవమాతు ర్జఠరం ప్రవిష్ణో హృతాని వ స్తేన బలా ద్వపూంషి|
దేవదేవుడును జగత్కారణుడును తనజన్మకు కారణమగునది లేనివాడును జగదాది కర్తయు అనాదియు విశ్వమున కాదియు వరేణ్యుడు( శ్రేష్ఠుడు- ప్రార్థనీయుడు) ను వరదుడును హరియు (పాపములను హరించువాడును) గొప్పవాని యన్నింటిలో గొప్పవాడును గొప్పవారికిని గొప్పవాడును ప్రమాణములకును ప్రమాణభూతుడును సప్తలోకగురుడు (తండ్రి) అగు బ్రహ్మకును తండ్రియు ప్రభులకును పరమ ప్రభువును మహాత్ముడును ఆదిమధ్యాంతరహితుడును భగవాముడును అగు మహాత్ముడీ విష్ణువు త్రైలోక్యమును సనాధము (రక్షణకలది) గా చేయుటకై అంశముతో అదితి గర్భమునందవతరించినాడు; రుద్రబ్రహ్మేంద్ర రవీందులకును మరీచ్యాది ప్రజాపతులకును అతని స్వరూపమెరుగరానిది; తన కలాంశముతో నృసింహ రూపుడై మునుపు మా తండ్రిని చంపిన ఈశుడు సర్వయోగీశ మనోనివాసుడునగు వాసుదేవుడీతడు; వేదతత్త్వవిదు లీయక్షరునెరిగి జ్ఞానబలమున తమ పాపములు పోద్రోలి అతనియందే లయమందుదురు; వారు మరల జన్మించరు; అట్టి వాసుదేవుని నమస్కరింతును; సముద్రమునుండి అలలువలె అతనినుండియే సమస్త భూతములునతని నుండి జనించి ప్రళయముననతనియందే లయమందును; రుద్ర బ్రహ్మాదులును ఆ పరమపురుషుని రూప బల ప్రభావ భవముల నెరుగజాలరు; రూప స్పర్శ రస శబ్ద గంధ గ్రహులగు చక్షుస్త్వక్ జిహ్వాశ్రోత్రఘ్రాణములును అతనిని గ్రహింపజాలవు; అట్టి స్తవనీయుడును మనోమాత్ర గ్రాహ్యుడును ఈశ్వరుడునునగు హరిని వాసుదేవుని నమస్కరింతును; తన ఏకదంష్ట్రాగ్రముతో నతడు భూమిని ధరించినందుననే ఆ దేవియు ఈ సర్వభూతములను ధరించగలుగుచున్నది; ఈ సకల జగము నాతనియందే శయనించియున్నది; అట్టిహరి అంశావతారమెత్తి దైత్యతేజములకు హానికలిగించినాడు; సంసార వృక్షకుఠారుడగు ఆ దేవుని నేను అజస్రమును నమస్కరించుచుందును. మహాత్ముడగు ఆదేవుడు జగత్కారణుడు. మహా7సురేంద్ర! అతడు తన పదునారవ అంశముతో దేవమాతృగర్భమున ప్రవేశించినందున నతని బలముచే దైత్య శరీరతేజస్సులు హరింపబడినవి.
శ్రీ మత్స్య మహాపురాణమున వామన చరిత్రమున వామన మూర్త్యవతారమను రెండు వందల నలుబది నాల్గవ అధ్యాయమ నుండి.

No comments:
Post a Comment