Monday, March 30, 2020

శ్రీ బ్రహ్మకృత శ్రీ వామనమూర్తి స్తుతిః

శ్రీ బ్రహ్మకృత శ్రీ వామనమూర్తి స్తుతిః



జయాద్యేశ జయాజేయ జయ సర్వాత్మకాత్మక |
జయ జన్మజరాపోత జయానన్త జయాచ్యుత. 68
జయాజిత జయామేయ జయావ్యక్తస్థితే జయ | పరమార్థార్థసర్వజ్ఞ జ్ఞానజ్ఞేయాత్మ నిస్సృత. 69
జయాశేషజగత్సాక్షి న్జత్కర్త ర్జగద్గురో | జగతో7స్యాన్తకృద్దేవ స్థితిం పాలయితుం జయ. 70
జయాశేష జయాశేష జయాఖిలహృది స్థిత | జయాదిమధ్యాన్త జయ సర్వజ్ఞాననిధే జయ. 71
ముముక్షుభినిర్దేశ్య స్వయం హృష్టజనేశ్వర | యోగినాం ముక్తిఫలద దమాదిగుణభూషణ. 72
జయాతిసూక్ష్మ దుజ్ఞేఞయ జయ స్థూలజగన్మయ | జయస్థూలాతిసూక్ష్మ త్వం జయాతీన్ద్రియ సేన్ద్రియ. 73
జయ స్వమాయాయోగస్థ శేషభోగశయాక్షర | జయైకదంష్ట్రా ప్రాన్తాగ్రసముద్దృత వసున్ధర. 74
నృకేసర న్జయారాతి వక్షస్థ్సల విదారణ | సామ్ప్రతం జయ విశ్వాత్మ న్జయ వామన కేశవ. 75
నిజమాయాపటచ్ఛన్న జగన్మూర్తే జనార్ధన | జయాజిత జయానేక స్వరూపైకవిధ ప్రభో. 76
వర్ధస్వ వర్ధితాశేషవికారప్రకృతే హరే | త్వయ్యేషా జగతా మీశే సంస్థితా ధర్మపద్ధతిః. 77
న త్వామహం న చేశానో నేన్ద్రాద్యా స్త్రిదశా హరే | న జ్ఞాతు మీశా మునయ స్సనకాద్యా న యోగినః. 78
త్వన్మాయాపటసంవీతే జగత్యత్ర జగత్పతే | కస్త్వాం వేత్స్యతి సర్వేశ త్వత్ప్రసాదం వినా నరః. 79
త్వమేవారాధితో యేన ప్రసాదసుముఖః ప్రభో | స ఏకః కేవలో దేవ వేత్తి త్వాం నేతరే జనాః. 80
నన్దీశ్వరేశ్వరేశాన ప్రభో వర్ధస్వ వామన | ప్రభవాయాస్య విశ్వస్య విశ్వాత్మ న్పృథులోచన. 81


భగవానుడగు గోవిందుడు వామనాకృతియై జనించెను; సర్వామరేశ్వరుడగు ఆ జగన్నాథుడవతరించ గనే దేవతలును తన్మాతయగు అదితియు దుఃఖముక్తులయిరి; సుఖస్పర్శ వాయువులు వీచెను; గగనము నిర్మలయ్యెను; సర్వభూతములకు ధర్మమందాసక్తి కలిగెను; అసురులకును భూమ్యంతరిక్ష ద్యులోకవాసులకును తదాదిగా ఉద్వేగము తగ్గెను; అతడు జనించినంతనే లోక పితామహుడగు బ్రహ్మ అతనికి జాతకర్మాదికము జరిపి అతనిని దర్శించి ఋషులు వినుచుండ ఆ దేవదేవేశునిట్లు స్తుతించెనుజయజయ ఆద్యా! ఈశా! అజేయా! సర్వాత్మకాత్మకా! జన్మజరారహితా! అనంతా! అచ్యుతా! అజితా! అమేయా! అవ్యక్తస్థితి! పరమార్థవస్తురూపా! సర్వజ్ఞా! జ్ఞాతృజ్ఞానజ్ఞేయరూపా! స్వయంభూరుపా! అశేష జగత్సాక్షిన్‌! జగత్కార్తా! జగద్దురూ! జగత్థ్సితిలయకరా! జగత్పాలకా! శేషా! శేషా! అశేషా! అఖిల హృదయావాసా! ఆదిమధ్యాంతరూపా! సర్వజ్ఞానవిధీ! ముముక్షువులును ఇట్టివాడవని నిర్దేశింపనలవికాని దేవా! ఆత్మతృప్తా ! జనేశ్వరా! యోగిముక్తి ఫల ప్రదా! దమాది గుణవిభూషణా !
అతిసూక్ష్మ! దుజ్ఞేయా! స్థూలజగన్మాయా! అతీంద్రియా! సేంద్రియా! మాయాయోగస్థితా! శేషభోగశయనా! అక్షరా! ఒకకోరకొనతోనే వసుంధరను పైకెత్తినవాడా! నృసింహా; శత్రువక్షఃస్థల విదారణా! విశ్వాత్మన్‌! వామనా! కేశవా! స్వమాయా వస్త్రాచ్ఛాదితజన్మూర్తీ! జనార్ధనా! అనేక రూపా! ఏకరూపా! ప్రభూ! వర్థిల్లుము వర్ధితాశేష వికారయుత ప్రకృతీ! హరీ! జగదీశుడవగు నీయందే ధర్మ మార్గము నిలిచియున్నది నేను కాని రుద్రుడు కాని ఇంద్రాది దేవతలు కాని మునులును సనకాది యోగులునుకాని నిన్నెరుగజాలరు. జగత్పతీ! నీమాయయను వస్త్రముతో కప్పుపడిన ఈజగమందు సర్వేశా! నీ యనుగ్రహమందక ఎవడు నిన్నెరుగును నిన్నారాధించి ప్రసాద సుముఖునిగా చేసి కొనినవారు మాత్రమే కాక ఇతరులు నిన్నెరుగజాలరు;
నందీశ్వరేశ్వరా! ఈశానా! ప్రభూ! వామనా: విశ్వాత్మన్‌! విశాల లోచనా! ఈ జగదభ్యుదయమునకై వర్ధిల్లుము.


శ్రీ మత్స్య మహాపురాణమున వామన చరిత్రమున వామన మూర్త్యవతారమను రెండు వందల నలుబది నాల్గవ అధ్యాయమ నుండి.

No comments:

Post a Comment