Sunday, March 29, 2020

శ్రీ ఈశ్వరకృత శ్రీ నరసింహస్తుతిః

శ్రీ ఈశ్వరకృత   శ్రీ నరసింహస్తుతిః




నమస్తేస్తు జగన్నాథ నరపసింహవపుర్హరే | దైత్యనాధాసృజాపూర్ణనఖశ (పం)క్తివిరాజిత. 54
జగత్సకలంసంలగ్న హేమపిజ్గళవిగ్రహ | నతోస్మి పద్మనాభ త్వాం సురశక్రజగద్గురో. 55
కల్పాన్తామ్భోద(ధి) నిర్ఘోష సూర్యకోటిసమప్రభ | సహస్రపరమక్రోధ సహస్రేన్ద్రపరాక్రమ. 56
సహస్రవదనస్ఫీత సహస్రచరణాత్మక | సహస్రకాలరచిత సహస్రనియతేన్ద్రియ. 57
సహస్రభూమిసద్దైర్య సహస్రానన్తమూ ర్తిమ9 | సహస్రచన్ద్రప్రతిమ సహస్రగ్రహవిక్రమ 58
సహస్రరుద్రతేజస్క సహస్రబ్రహ్మసంస్తుత | సహస్రవాయువేగోగ్ర సహస్రాక్షనిరీక్షణ. 59
సహస్రయన్త్రమథన సహస్రబన్ధమోచక | అన్దకస్య వినాశాయ యా స్సృష్టా మాతరో మయా. 60


జగన్నాథా | నృసింహదేవాధారిన్‌ ! హరీ! (పాపముల హరించువాడా!) దైత్యనాథుని రక్తముతో నిండిన గోళ్ళు అనెడు శక్త్యాయుధములు కలవాడా! నీకు నమస్కారము. సకల జగమునందును వ్యాపించిన బంగారువంటి పచ్చనిమూర్తి కలవాడా! ప్రళయకాల మేఘ ధ్వనివంటి నాదము కలవాడా! పద్మనాభా! దేవతలకును ఇంద్రునకును సమస్త జగత్తునకును తండ్రీ ! సహస్ర విధములగు మహాక్రోధము గలవాడా! సహస్రేందులంత పరాక్రమము కలవాడా! సహస్ర ముఖముల సమృద్ధి కలవాడా! సహస్రపాదా! సహస్రకాలముల రచించువాడా! సహస్ర సంఖ్యాకములగు ఇంద్రియములును నిగ్రహించువాడా! సహస్ర భూలోకములకును మంచి ధైర్యము నొసంగువాడా! వేలుకొలదిగా అనంతమూర్తులు కలవాడా! సహస్ర చంద్ర సమానా! సహస్రగ్రహ విక్రమా; సహస్ర రుద్ర సమాన తేజశ్శాలీ! సహస్ర బ్రహ్మ పరిస్తుతా! సహస్ర వాయువేగ భయంకరా ! సహస్ర నేత్రములతో చూచువాడా! వేలకొదలిగా యంత్రములను మథించువాడా! సహస్ర బంధనములనయిన విడిపించువాడా! నిన్ను నమస్కరించుచున్నాను.


 శ్రీ మత్స్య మహాపురాణమున అంధకాసుర వధము- రౌద్ర- నారసింహ- మాతృకోత్పత్తియను నూట డెబ్బది ఎనిమిదవ అధ్యాయము నుండి.

శ్రీ నారాయణ తత్త్వము

 శ్రీ నారాయణ తత్త్వము


విశ్వాయనోయం బ్రహ్మాపి న వేదయతి తత్త్వతః l తత్కర్మ విశ్వవేదానాం తద్రహస్యం మహర్షిణామ్‌. 19
తమీడ్యం సర్వయజ్ఞానాం తత్తత్త్వం సర్వదర్శినామ్‌ l తదాధ్యాత్మవతాం చిన్త్యం నరకం చ వికర్మిణామ్‌.
దేవానామధిదైవం యదధియజ్ఞం చ సంజ్ఞితమ్‌ తద్బూతమవిభూతం చ తత్పరం పరమర్షణామ్‌. 21
స యజ్ఞ వేదనిర్దష్టస్తత్తపః కవయో విధుః l సకర్తా కారకో బుద్ధిర్దర్మః క్షేత్రజ్ఞ ఏవచ. 22
ప్రణవః పురుషశ్శాస్తా ఏకశ్చేతి విభావ్యతే l ప్రాణః ప ఞ్చవిధశ్చైవ ధ్రువమక్షర ఏవచ. 23
కాలఃపాకశ్చ పక్తాచ ద్రష్టా స్వాధీన ఏవ చ l ఉచ్యతే వివిథైర్బావై స్సఏవాయం న తత్పరః. 24
సఏవ భగవాన్త్సర్వం కరోతి వికరోతిచ l సో7స్మాన్కారయతే సంవమన్యేపి వ్యాకులీకృతాః. 25
యజామహే తమేవాద్యం తమేవేచ్ఛామ నిర్వృతాః l యోవక్తా యచ్చ వక్తవ్యం యచ్చాహం యద్బ్రవీమివః. 26
శ్రూయతే యచ్చవై శ్రావ్యం యచ్చాన్యత్పరిజల్ప్యతే l యత్కథాంశ్చైవ వర్తన్తే శ్రుతయో వాథ తత్పరాః. 27
విశ్వం విశ్వపతిర్యశ్చ సతు నారాయణస్స్మృతః యత్సత్యం యదమృత మక్షరం పరం య ద్యద్బూతం పరమమిదంచ యద్బవిష్యమ్‌. 28
యత్కిఞ్చిచ్చరమచరం రుదస్తి చాన్యత్తత్సర్వం పురుషవరః ప్రభుఃపురాణః.


విశ్వములకు ఆశ్రయుగడు బ్రహ్మయును ఏ తత్త్వమును వాస్తవరూపమున తెలుపజాలడో అట్టి నారారూణాత్మక పరతత్త్వమును ఎవరు ఎరుగగలరు? ఆనారాయణ తత్త్వము సర్వవేదములచే ప్రతిపాద్యమగు (యజ్ఞాది వైదిక) కర్మానుష్ఠానము; అది మహర్షులకును ఎరుగరాని రహస్యము; సర్వయజ్ఞములందు స్తుతింపబడు తత్త్వము ; సర్వదర్శలకు వారు దర్శించు తత్త్వమది; అధ్యాత్మ (అత్మఅనగా ఇట దేహము; దేహము నాశ్రయించియుండు అయా సూక్ష్మతత్త్వములు అధ్యాత్మతత్త్వములు) తత్త్వవిచారకులు అలోచింపవలసిన తత్త్వమది; విరుద్దకర్మల నాచరించువారికి నరకమును అ తత్త్వమే; దేవతలలో అదిధై వతతత్త్వము యజ్ఞములలొని అధియజ్ఞ తత్త్వమును భూతములయందలి అధిభుతతత్త్వమును పరమర్షులకును అందరాని పరతత్త్మును వేదములచే నిర్దేశింపబడిన యజ్ఞమును తపస్సును కర్త-కారకుడు(కర్మప్రేరకుడు-కర్మసాధనములు) బుద్ధి-ధర్మము-క్షేత్రజ్ఞుడు (దేహమునందుండు చేతనతత్త్వము) (భగవదుపాసన సాధనమగు) ప్రణవము (ఉపాస్యుడగు) పురుషుడు(అంతర్యామియై) శాసించువాడు-ఇవన్నియు ఒక్కటియే యని భావన చేయబడు తత్త్వమును (ప్రాణపానవ్యానోదాన సమానములను) పంచవిధ ప్రాణములను ధ్రువమగు అక్షరతత్త్వము కాలమును (కాలవశమున కలుగు ) పరిపాకమును పరిపాకము నొందించువాడును వీటికి ద్రష్ట (సాక్షి) యగు వాడును స్వాదీనుడు (స్వతతంత్రుడును) వివిథ భావము (రూపము) లతో ఉన్నాటు చెప్పబడువాడును అతడే అతనికంటె పరుడు-(గొప్పవాడు) ఎవరును లేరు; ఆ భగవానుడే సర్వమును సృష్టించును; పరిణమింపజేయునుమనచే చేయించునుఅన్యులను (తన్నుపాసించనివారిని) వ్యాకుల పరచును; అద్యుడగు అ నారాయణునే యజించుచున్నాముఅతనినే (పొంద)కోరుచున్నాముఅతని వలన ఆనందము నందగోరుచున్నాము; వినబడునదియు వినదగినదియు పరిజల్పనము చేయబడునదియ( అసంబద్ధముగా అనావశగకముగా మాటలాడుగ పరిజల్పనము) చెప్పువాడును చెప్పబడునదియ చెప్పదగినదియు నేను మీకేది చెప్పుచున్నానో అదియు ఎవరిని కూర్చిన మాటలు జరుగుచున్నవో-అతడును శ్రుతులు యత్పరములై (ఎవనిని తెలుపుచు) ఉన్నచో అతడును విశ్వమును విశ్వ రక్షకుడును సత్యమును అమృతతత్త్వమును అక్షర (నశించని) తత్త్వమును పరమతత్త్వమును భూతము (గడచినది) ఈ పదమును (వర్తమానము-ఇపుడు జరుగుచున్నది)భవిష్యమును చరమును (చలించునది) అచరమును (కదలని వస్తువు) ఈ చెప్పిన దేదియుకాక మిగిలినది ప్రతియొక్కటియు పురుషశ్రేష్ఠుడు ప్రభువు పురాణుడు (ఈ విశ్వము అను పురమునందు చైతన్యరూపుడై శ్వాసించువాడు-పుర-+అన-పురాణ)ను ఆ నారాయణుడే.


శ్రీమత్స్య మహాపూరాణమున నారాయణ నాభి పద్మోద్బవ ప్రశ్నాది ప్రతిపాదనమను నూట అరువది మూడవ అధ్యాయము నుండి.

బ్రహ్మాదీదేవకృత శ్రీ నృసింహస్తుతిః

బ్రహ్మాదీదేవకృత శ్రీ నృసింహస్తుతిః


బ్రహ్మా: భవాన్బ్రహ్మాచ రుద్రశచ మహేన్ద్రో దేవసత్తమః. 99
భవాన్కర్తావికర్తాచ లోకానాం ప్రభవో7వ్యయః l పరంచ సిద్ధంచ పరంచ దేవం పరంచ మన్త్రం పరమం హవిశ్చ. 100
వరంచ ధర్మం పరమంచ విశ్వం త్వామాహురగ్య్రం పురుషంపురాణమ్‌ l పరంచ సత్యం పంమం తపశ్చ పరం పవిత్రం పరమంచ మార్గమ్‌. 101
పరంచ యజ్ఞం పరమంచ హోత్రం త్వామాహురగ్య్రం పురుషం పురాణమ్‌ l పరం శరీరం పరమంచ బ్రహ్మపరంచ యోగం పరమాంచ వాణీమ్‌. 102
పరం రహస్యం పరమాం గతించ త్వామాహురగ్ర్యంపురుషం పురాణమ్‌ l పరం పరస్యాపి పరం పదం యత్‌. 103
పరం పరస్యాపి పరంచ హృద్యం త్వామాహుర గ్య్రం పురుషం పురాణమ్‌ l ఏవం పరసగాపి పరం పదం యత్పరం పరస్యాపి పరంచ పదేవమ్‌. 104
పరం పరస్యాపి పరంచ భూతం త్వామాహురగ్య్రం పురుషం పురాణమ్‌ l పరం పరస్యాపి వరం నిదానం పరం పరస్యాపి వరం పవిత్రమ్‌. 105
పరం పరస్యాపి పరం దాన్తం త్వామాహుర గ్య్రం పురుషం పురాణమ్‌ lఏముక్త్వాతుభవాన్త్సర్వలోకపితామహః . 106

బ్రహ్మ ఆ నరసింహు నిట్లు స్తుతించెను: బ్రహ్మరుద్రుడు దేవసత్తముడగు మహేంద్రుడు లోకములకు కర్తయు వికర్తయు( పరిణామము నొందించువాడు- లయము నొందించువాడు) కారణభుతుడును నయియుండియు తాను ఏ మార్పును లేకయుండు తత్త్వము నీవే. వరుడు (ఉత్కృష్టుడు) అగు సిద్ధుడు పరదేవుడు పరమంత్రము పరమ హవిస్సు (దేవతల నుద్దేశించి అగ్నిలో అర్పించు ద్రవ్యము) పరమ ధర్మము పరమ పరమ విశ్వము పంను సత్యము పరమ తవము పరమ పవిత్రము పరము మార్గము (మోక్ష సాధనము ) పరమ యజ్ఞము పరమహోత్రము (హోమ పాధనము) పరమ శరీరము పరమ బ్రహ్మము పరమ యోగము పరమ వాణి (వాక్కు) పరమ రహస్యము పరమ గతి (మోక్షము) పరమము కంటెపరమమగు రహస్యము పరమ పరమపదము (స్థానము) పరమ పరమహృద్యము (ప్రీతికంమగు తత్త్వము (పరమ పరమదేవుడు పరమ పరమభూతము పరమ పరమ నిదానము (అది కారణము) పరమ పరమ పవిత్రము పరమపరమ దాంతము (అన్నిటిని అణుచునది) నీవేయని తత్త్వవేత్తలు చెప్పుచున్నారు. 
శ్రీ మత్స్య మహా పూరాణమును హిరణ్యకశిపూపాఖ్యానమున నరసింహుడు హిరణ్యకశిపుని విధించుటయను నూట అరువది రెండవ అధ్యాయము నుండి.

ప్రహ్లాద కృత నరసింహస్తుతి

జయ గణేశ

ప్రహ్లాద కృత నరసింహస్తుతి


ప్రహ్ణాదకృతసింహమహిమానువర్ణనమ్‌.
ప్రహ్లాదః: మహారాజ మహాబాహోదైత్యానా మాదిసమ్భవl న శ్రుతం నైవ నో దృష్టం నారసింహమిదం వపుః. 4
అవ్యక్తప్రభవం దివ్యం కిమదం రూపమాగతమ్‌ l దైత్యాన్తకరణం ఘోరం శంసతీవ మనోమమ. 5
అస్య దేవాశ్శరీరస్థా స్సాగరా స్సరితశ్చయాః l హిమవాన్పారియాత్రశ్చ యే చాన్యే కులపర్వతాః. 6
చన్ద్రమాస్సహనక్షత్రై రాదితగా శ్చాశ్విభిస్సహl ధనదో వరుణశ్చైవ యమశ్శక్ర శ్శచీపతిః. 7
మరుతో దేవగన్దర్వా ఋషయశ్చ తపోధనాఃl నాగా యక్షాః పిశాచాశ్చ రాక్షసా భీమవిక్రమాః. 8
బ్రహ్మా దేవః పశుపతిర్లలాటస్థా భ్రమన్తివై l స్థావరాణిచ సర్వాణి జజ్గమాని తథైవచ. 9
భవాంస్తు సహితోస్మాభి స్సర్వైర్దైత్యగణౖ ర్వృతః l విమానశతసజ్కీర్ణా తథైవ భవతస్సభా. 10
సర్వం త్రిభువనం రాజన్లోకధర్మశ్చ శాశ్వతాఃl దృశ్యన్తే నరసింహే7 స్మిం స్తథేదవ మఖిలం జగత్‌. 11
ప్రజాపతిశ్చాత్ర మనుర్మహాత్మా గ్రహాశ్చ యోగాశచ మహీ నభశ్చl ఉత్పాతకాలశ్చ ధృతిస్మ్సృతిశ్చ రతిశ్చ సత్యంచ దమస్తవశ్చ. 12
సనత్కు మారశ్చ మహానుభావో విశ్వేచ దేవా ఋషియశ్చ సర్వే l క్రోధశ్చ కామశ్చ తథైవ హర్షో ధర్మశ్చ మోహః పితరశ్చ సర్వే. 13

కాలచక్రమువలె (కాలుడు ప్రయోగించిన చక్రాయుధము. కాలా త్మకమగు చక్రము-అను రెండర్థములును ఇచట అన్వయించును.) వచ్చిన ఆ మహాభాగుని నరసింహుని చూచి హిరణ్య కశిపు పుత్త్రుడు వీర్యవరతుడునగు ప్రహ్లాదుడు అనునాతడు- ఈ వచ్చిన యాతడు నిపురుకప్పిన నిప్పువలె నరిసింహ శరీరము కప్పుకొనిన పురుషోత్తమ దేవుడేయని తన దివ్య (జ్ఞాన) నేత్రముతో చూచి ఎరిగెను. బంగరు కొండవంటి ఆ పూర్వ శరీరము దాల్చియున్న ఆ నృసింహుని చూచి దానవులందరును హిరణ్యకశివుడు కూడ ఆశ్చర్యపడిరి.
అపుడు హిరణ్యకశిపునితో ప్రహ్లాదుడిట్లనెను: మహారాజా! మహాబాహూ! దైత్యులలో మొదటి జనించినవాడా! ఇట్టి నారసింహ రూపము ఇదివరకు వినినదియు కనినదియుకాదు; అవ్యక్త పతత్త్వము (మాయతో అనుబద్ధమగు పరమాత్మతత్త్వము -దీనినే మాయా శబలమందురు.) నకు కూడ ప్రాదుర్బావ కారణమగు (కారణ కారణమగు) పరమాత్మ రూపమే ఇట్లు వచ్చినదేమో! ఈ ఘోర రూపము దైత్యనాశకరమేమో యని నామనస్సు చెప్పుచున్నట్లున్నది. ఈ దేవుని శరీరమున సాగరములు నదులు హిమవత్పారియాత్రాది కులపర్వతములు చంద్రుడు నక్షత్రములు అదిత్యులు అశ్వినులు కుభేర వరుణ యమ శచీపతి మరుత్తులు దేవతలు గంధర్మలు మునులు ఋషులు నాగయక్ష పిశాచులు భయంకర విక్రములగు రాక్షసులు బ్రహ్మరుద్రులు ఈతని లలాటమున తిరుగుచున్నారు. స్థిరచర ప్రాణులు పదార్థములు నేను మొదలగు ఈ దైత్యగణములతో కూడ నీవు నూరులకొలది విమానములతో నిండిన ఈ నీ సభ సర్వ తరిభువనము శాశ్వతములగు లోక ధర్మములు అభిల జగమును ఈ నరసింహునియందు కనబడుచున్నవి. మహాత్ములకు ప్రజాపతులు మనువులు గ్రహములు యోగములు భూమ్మంతరిక్షములు ఉత్పాత సమయము ధృతి (నిబ్బరము) స్మృతి రతి (అసక్తి- ఆనందము) సత్యదమ తపస్సులు మహానుభావుడగు సనత్కుమారుడు (ననత్‌-సదా; ఎల్లపుడు; కుమారుడుగానే ఉండు నివృత్తి మార్గ ప్రవృత్తుడయిన మహాయోగి) విశ్వదేవులు సర్వ ఋషులు కామక్రోధ ధర్మ హర్ష మోహములు సర్వపితరులు అందరు ఈ నృసింహునిరుందు కనబడుచున్నారు.

శ్రీమత్స్యమహాపురాణమున హిరణ్య కశిపూపాఖ్యానమున హిరణ్యకశిపు ప్రభృతులు నరసింహునిపై శస్త్రాస్త్రములు వర్షించుటయను నూట ఆరువది ఒకటవ యధ్యాయము నుండి