Sunday, May 10, 2020

దేవతలు చేసిన విష్ణు స్తుతి - వింధ్య పర్వతము పెరుగుదల నాపుటకు

దేవతలు చేసిన విష్ణు స్తుతి - వింధ్య పర్వతము పెరుగుదల నాపుటకు







జయ విష్ణో రమేశాద్య మహాపురుష పూర్వప. 
దైత్యారే కామజనక సర్వకామ ఫలప్రద | మహావరాహ గోవింద మహాయజ్ఞ స్వరూపక. 
మహావిష్ణో ధ్రువేశా೭೭ద్య జగదుత్పత్తి కారణ | మత్స్యావతాదే వేదానా ముద్ధారాధార రూపక. 
సత్యవ్రతధరా ధీశ మత్స్య రూపాయ యతే నమః | జయా7కూపార దైత్యారే సుకాయ సమర్పక. 
అమృతాప్తి కరేశాన కూర్మరూపాయ తే నమః | జయా೭೭దిదైత్యనాశార్థ మాదిసూకరరూపధృక్‌. 
మహ్యుద్ధార కృతోద్యోగ కోలరూపాయ తే నమః | నారసింహంవపుః కృత్వా మహాదేత్యం దదార యః 
కరజై రవ దృప్తాంగం తసై#్మ నృహరయే నమః | వామనం రూప మాస్థాయ త్రైలోక్యై శ్వర్యమోహితమ్‌. 
బలింసంఛలయామాస తసై#్మ వామనరూపిణ | దుష్టక్షత్త్రవినాశాయ సహస్రకరశత్రవే. 
రేణుకాగర్బజాతాయ జామదగ్న్యాయ తే నమః | దుష్టరాక్షస పౌలస్త్య శిరచ్చేద పటీయసే. 
శ్రీమద్ధాశరథే తుభ్యం నమో నంత క్రమాయ చ | కంసదుర్యోధనాద్యై శ్చ దైత్యైః పృథ్వీశలాంచనైః 
భారాక్రాంతాం మహీం యో సావుజ్జాహార మహావిభుః | ధర్మం సంస్థా పయామాస పాం కృత్వా సుదూరతః. 
తసై#్మ కృష్ణాయ దేవాయ నమోస్తు బషుధా విభో | దుష్ట యజ్ఞ విఘాతాయ పశుహింసానివృత్తయే. 

దేవతలు భక్తిమీర గద్గదస్వరముతో విష్ణు నిట్లు సంస్తుతించిరి. మహాపురుషా ! పూర్వజ ! రమాకాంతా! నీకు జయము. కామజనకా !కామఫలదాయక ! విష్ణు ! నీకు జయమగుత ! మహావరాహా ! గోవింద! మహాయజ్ఞ స్వరూపా ! మహావిష్ణు! జగదుత్పత్తికారణ! మత్స్యావతారా ! వేదోద్ధారకా ! ఈశా !నీకు జయమగుత! మత్స్యరూపా ! సత్యవ్రత పరాయణా! దానవాంతకా ! సురకార్య నిర్వాహక ! దయాసాగరా! నీకు నమస్కారములు. అమృతము సంపాదించిన దేవా ! ఈశానా ! కూర్మరూపా ! నీకు నమస్కారములు. దానవ నాశకా ! ఆది వరాహరూప ! నీకు నమస్కారములు. భూమి నుద్ధరించుటకు వరాహరూపము దాల్చిన దేవా ! మహాదైత్యుని సంహరించిన నరసింహరూపా ! నీకు నమస్కారములు. వాడి గోళ్లతో దానువుని చీల్చిన నరసింహా !నీకు నమస్కారములు. వామనరూపమున ముల్లోకముల సంపదలకు గర్వించిన బలి నణచితివి. బలిగర్వ మడచిన వామనునకు నమస్కారములు. కార్తవీర్యార్జునుడు నోడించినవాడు దుష్టక్షత్రియుల దునుమాడినవాడును రేణుకకు జన్మించినవాడునైన పరశురామ రూపము దాల్చిన దేవా ! నమస్కారములు. దుష్ట రాక్షసుడైన రావణాసురుని శిరము దును మాడిన వాడును అనంతవిక్రముడు ధర్మవిగ్రహుడు మోహనరూపుడునైన దశరథరాముడవు నీవు ! నీకు నమస్కారములు. కంసుడు దుర్యోధనుడు మొదలగు దైత్యభూమిపతులను భూమి భరింప లేకుండెను. అపుడు ధర్మసంస్థాపనకు పాపులను చంపి భూమి భారము తగ్గించితివి. అట్టికృష్ణ పరమాత్ముడవు- విభువవు నగు నీకు పలుమార్లు నమస్కరించుచున్నాము. యజ్ఞములు వలదని- పశుహింస తగదని ప్రబోధము చేసినవాడవు. బుద్ధరూపము దాల్చిన దేవుడవు నీకు నమస్కారములు.
బౌద్ధరూపం దధౌ యోసౌ తసై#్మ దేవాయతేనమః | వ్లుెచ్చ ప్రాయేఖిలే లోకే దుష్టరాజన్యపీడితే. 
కల్కిరూపం సమాదధ్యౌ దేవదేవాయ తేనమః | దశావతారాస్తే దేవ భక్తానాం రక్షణాయ వై. 
దుష్టదైత్య విఘాతాయ తస్మాత్త్వం సర్వదుఃఖహృత్‌ | జయభక్తార్తినాశాయ ధృతం నారీజలాత్మసు. 
రూపం యేన త్వయా దేవ కోన్య స్త్వత్తో దయానిధిః | 

లోకమంతయును చెడు రాజులచేత పీడింపబడి వ్లుెచ్చులతో నిండియుండు నపుడు కల్కి రూపము దాల్చి దుష్టుల నంతమొందించిన దేవ దేవా ! నీకు నమస్కారములు. దేవా ! నీవు భక్తులను బ్రోచుటకు యీ పది యవతారములు దాల్చితివి. నీవు దుష్టదైత్యులను చంపి విఘ్నములు దుఃఖములు తొలగించితివి. అట్టి భక్తులు యార్తి బాపుటకు నారీ జలరూపములు దాల్చిన దేవుడవు నీకు నమస్కారములు. దయాననిధీ ! దేవా ! నీవు దాల్చిన రూపములు నీవు దక్క యితరు డెవడు దాల్చగలడు? అని దేవతలు పీతవసనుడు - దేవదేవేశుడు నగు విష్ణునిస్తుతించిరి. 


దదామి పరమ ప్రీతః స్తవస్యాస్య ప్రసాదతః | య ఏతత్పఠతే స్తోత్రం కల్య ఉత్థాయ మానవః 
మయి భక్తిం పరాం కృత్వా నతంశోకః సృశేత్కదా | అలక్ష్మీ కాలకర్ణీ చ నాక్రామే త్తద్గృహం సురాః 
నోపసర్గా నబేతాళా నగ్రహ బ్రహ్మ రాక్షసాః | నరోగా వాతికాః పైత్తాః శ్లేష్మసంభవినస్తథా. 
నా కాలమరణం తస్య కదాపి చ భవిష్యతి | సంతతిశ్చిరకాలస్థా భోగాః సర్వే సుఖాదయః 
సంభవిష్యంతి తన్మర్త్య గృహే యఃస్తోత్ర పాఠకః | కిం పునర్బ హునోక్తేన స్తోత్రం సర్వార్థ సాధకమ్‌. 
ఏతస్య పఠనాన్నౄణం భుక్తిముక్తీన దూరతః | 

మీరుచేసిన స్తోత్రమును దయమున లేచి చదువువాడు నా యందు భక్తిగలవాడగును. అతని నెన్నెడను శోకమంటదు.సురలారా ! అతని యింటిని పెద్దమ్మగాని అకాలమృత్యువుగాని యెన్నడు నాశింపదు. అతని యింట బ్రహ్మ రాక్షస-బేతాళ గ్రహముమలు చేరవు. అతనికి వాత -పిత్త-శ్లేష్మరోగములు దాపురించవు. అతని కెన్నడు నకాలమరణము గలుగదు. అతని సంతతి చిరకాలము జీవించును. సుఖభోగములు కలుగును. ఈ స్తోత్రము చదువువాని యింట సుఖము లెల్ల గలుగును. వేయేల ! ఈ స్తోత్రము సకలార్థసాధకము. దీనిని చదివిన వారికి భుక్తి ముక్తులు కరతలామలకములు.

శ్రీ శ్రీదేవీ భాగవత మహాపురాణ మండళమందలి దమ స్కంధమున పంచమాధ్యాయము నుండి.

Friday, April 3, 2020

దేవదానవ కృత శ్రీ విష్ణుస్తుతిః.

దేవదానవ కృత శ్రీ విష్ణుస్తుతిః.


నమో లోకత్రయాధ్యక్ష తేజసా జితభాస్కర. 38
నమో విష్ణో నమో జిష్ణో నమస్తే కైటభార్దన | నమ స్సర్గక్రియాకర్త్రే జగత్పాలయతే నమః. 39
రుద్రరూపాయ శర్వాయ నమ స్సంహారకారిణ | నమ శ్శూలాయుధాధృష్య నమో దానవఘాతినే. 40
నమః క్రమత్రయా క్రాన్త త్రైలోక్యాయాభవాయచ నమః| ప్రచణ్డదైత్యేన్ద్ర తూలకాలమహానల. 41
నమో నాభిహ్రదోద్భూత పద్మగర్భ మహాచల| పద్మబూత మహాభూతకర్త్రే హర్త్రే జగత్ప్రియ. 42
జనితా శేషలోకేశ క్రియాకారణకారిణ| అమరారివినాశాయ మహాసమరశాలినే. 43
లక్ష్మీ ముఖాబ్జమధుప నమః కీర్తినివాసినే| అస్మాక మమరత్వాయ ధ్రియతాం ధ్రియతా మయమ్‌. 44
మన్దర స్సర్వశైలానా మయుతాయుతవస్తరః| అనన్తబల బాహుభ్యా మవష్టభ్యైకపాణినా. 45
మథ్యతా మమృతం దేవ స్వథాస్వాహార్థకామినామ్‌| తత శ్శ్రుత్వా న భగవా & స్తోత్రం పూర్వం వచ స్తదా. 46

విహాయ యోగనిద్రాం తా మువాచ మధుసూదనః| శ్రీ భగవా& : స్వాగతం విబుధా స్సర్వే కి మాగమన కారణమ్‌. 47
యస్మా త్కార్య దిహ ప్రాప్తా స్తద్బ్రూత విగతజ్వరాః| నారాయణ నైవ ముక్తాః ప్రోచు స్తత్ర దివౌకసః. 48
అమరత్వా య దేవేశః మథ్యఘానే మహోదధౌ| యథామృతత్వం దేవేశ తథా నః కురు మాధవ. 49
త్వయా వినా న త చ్ఛక్య మాస్మాభిః కైటభార్దన| ప్రాప్తుం త దమృతం నాథ తతో గ్రే భవ నో విభో. 50
లోకత్రయాధ్యక్షా ! తేజోజిత భాస్కరా ! విష్ణో! జిష్ణో! కైటభమర్ధనా ! సృష్టిక్రియాకర్తా ! జగత్పాలయితా ! నమస్కారము; రుద్రరూపా ! శర్వా! సంహారకారిన్‌! శూలాయుధా! అధృష్యా! దానవఘాతిన్‌ !నమస్కారము ; పాదత్రయక్రమాక్రాంత త్రైలోక్యా! అభవా!ప్రచండదైత్యంద్రతూల ప్రళయ మహాగ్నీ ! నా భిహ్రద సంజాత పద్మగర్భ మహాచలా ! పద్మభూతా మహాభూతా! (పాద్మకల్పమున పృథ్వీ మహాభూతమునారాయణుని నాభి పద్మమని చెప్పబడెను.) కర్తా!హర్తా!జగత్ప్రియా!అసేష లోకపాల జనకా!క్రియాకారణ కారిన్‌!దేవారి వినాశకా! మహాసమరసాలిన్‌ ;లక్ష్మీ ముఖ పద్మ మధుపా !కీర్తినివాసిన్‌!నమస్కారము; మాకు అమరత్వము కలిగింప నిశ్చయించుము ;సర్వ శైలములలో గొప్పదియు అయుతాయుత యోజన విస్తామునునగు ఈ మందరమును నీ అనంత బలబాహుద్వయమందలి ఒక బాహువుతో ఒక పాణితో నిలువబెట్టి ధరించుము ;స్వధాస్వాహార్థహవిః కాములగు దేవతలకై అమృతమును మథించవలయును ;
అనిన స్తోత్ర పూర్వక దేవవచనమును విని మదుసూదనుడు యోగనిద్ర విడిచి ఇట్లనెను : సర్వదేవతలారా! స్వాగతము; మీ ఆగమన కారణమి? మనః సంతాపము విడిచి మీరు వచ్చిన పని తెలుపుడు; అట నారాయణుడిట్లు పలుకగ విని దివౌకసులిట్లనిరి ;దేవేశా! మాకమరత్వ ప్రాప్తికై చేయు ఈ మహోదధి మథనముచే మా కది లభించు నుపాయమొన రింపుము; మాధవా! కైటభమర్దనా!విభూ!నీవు లేనిదే మాచే ఆ అమృతము పొంద శక్యముకాదు ;కావున నీవు మా ముందుడుము.

శ్రీ మత్స్య మహాపురాణమున దేవదానవులు అమృతమునకై క్షీరసాగరమును మథించుటయను రెండు వందల నలువది ఎనిమిదవ యధ్యాయము నుండి.

Tuesday, March 31, 2020

భూదేవీ కృత శ్రీ విష్ణుస్తుతిః

భూదేవీ కృత శ్రీ విష్ణుస్తుతిః


త్రివిత్రమాయామితవిక్రమాయ మహావరాహాయ సురోత్తమాయ. 11
శ్రీశార్‌ఙ్గ చక్రాసిగదాధరాయ నమో7స్తుతే దేవవర ప్రసీద | తవ దేహాజ్జగజ్జాతం పుష్కరద్వీప ముత్థితమ్‌.
బ్రహ్మణ మిహ లోకానాం భూతానాం శాశ్వతం విదుః | తవ ప్రసాదా ద్దేవోయం
దివం భుఙ్త్కే పురన్దరః. 13
*తవ క్రోధా ద్వినిర్ధూతా స్సర్వే దైత్యా జనార్దన | దాతా విధాతా సంహర్తా త్వయి సర్వం ప్రతిష్ఠితమ్‌.
*తవ క్రోధాద్ధి బలవా న్జనార్ధన జితో బలిః.
మనుః కృతాన్తో నియతం జ్వలనః పవనో ఘనః | వర్ణాశ్చాశ్రమ ధర్మాశ్చ సాగరా స్తరవో చలాః. 15
నద్యో ధర్మశ్చ కామశ్చ యజ్ఞో యజ్ఞస్య యాః క్రియాః. విద్యా వేద్యంచ సత్త్వం చ హ్రీశ్శ్రీః కీర్తి ర్దృతిః క్షమాః. 16
పురాణం వేదవేదాఙ్గం సాఙ్ఖ్యం యోగో భవాభవౌ | జజ్గమం స్థావరం చైవ భవిష్యతి చ భవచ్చ యత్‌. 17
సర్వం తచ్ఛ త్రిలోకేషు ప్రబావోవహితం తవ | త్రిదశోదారఫలదః స్వర్గస్త్రీ చారుపల్లవః. 18
సర్వలోకమనః కాన్త స్సర్వసత్త్వ మనోహరః | విమాననేకవిటప స్తోయదామ్బుమధుస్రవః. 19
దివ్యలోక మహాస్కన్ధ స్సత్యలోక ప్రశాఖవా| 20
సాగరాకారనిర్యాసో రసాతలజలాశ్రయః | నాగేన్ద్రపాదపోపేతో జన్తుపక్షినివితః. 21
శీలాచారార్యగన్ధశ్చ సర్వలోకమయో ద్రుమః | ద్వాదశార్కమయద్వీపో రుద్రైకాదశపత్తనః. 22
వస్వష్టాచలసంయుక్త సై#్త్రలోక్యామ్భోమహోదధిః | సిద్ధిసాధ్యోర్మిసలిల స్సుపర్ణానిలసేవితః. 23
దైత్య లోక మహాగ్రాహో యక్షోరగగణాకులః | పితామహా మహాధైర్య స్స్వర్గ స్త్రీ రత్నభూషితః. 24
త్వం స్వయోగ మహావీర్యో నారాయణ మహార్ణవః | త్వయా సృష్టా స్త్రయో లోకా స్త్వయైవ ప్రతిసంహృతా. 26
విశన్తి యోగిన స్సర్వే త్వామేవ ప్రతియోజితాః | యుగే యుగే యుగాన్తాగ్నిః కాలమేఘో యుగేయుగే. 27
త్రివిక్రమా! అమిత విక్రమా! మహావరాహా! సురోత్తమా! శ్రీ శార్జచక్రాసిధరా గదాధరా; నీకు నమస్కారము; దేవోత్తమా! ప్రసన్నుడవుగమ్ము; దేవా! నీ దేహమునుండి జగము జనించినది; పుష్కర ద్వీపము ఉత్థితమయినది; లోకములను సృష్టించు బ్రహ్మయు సకల భూతములతో శాశ్వతుడవును నీవే యని వేదములనును; నీయనుగ్రముననే ఈ పురందరుడు స్వర్గమునుభవించుచున్నాడు. జనార్ధనా! నీ క్రోధముననే సర్వదైత్యులును(బె) చెదరిపోవుచున్నారు; ధాత (స్రష్ట) విధాత (స్థితికర్త) సంహర్త- ఇందరును ఇదియంతయు నీ యందే నిలిచియున్నది; మనువు యముడు అగ్ని వాయువు పర్జన్యుడు వర్ణములు ఆశ్రమ ధర్మములు సాగరములు పర్వతములు వృక్షములు నదులు ధర్మము కాముడు యజ్ఞములు యజ్ఞ క్రియలు విద్యయు (తెలియవలసినది) సత్త్వము - హ్రీ- శ్రీ- కీర్తి ధృతి- క్షమ పురాణములు వేదములు వేదాంగములు సాంఖ్యము యోగము భవము (సృష్టి) అబావము (ప్రళయము) స్థావర జంగమ (చర) భూతములు భూతము వర్తమానము భవిష్యము ఇంకను త్రిలోకముల యందున్నదంతయును నీ ప్రభావమును ఆశ్రయించియున్నవి; త్రిదసుల (దేవతల) నెడు ఉదార ఫలమునిచ్చునదియు స్వర్గ స్త్రీలనెడు మనోహరపల్లవములు కలదియు ను సర్వలోకమనోహరమును విమానములను అనేక శాఖలు కలదియు మేఘజలమను తేనెను స్రవించునిదియు దివ్య లోకములను మహాస్కంధము (పెద్ద బోదె) సత్యలోకమను చిగురు కొమ్మ సాగర (జల) ములనెడు నిర్యాసము (జిగురు ఊట) రసాతలమనెడు పాతు ఆదిశేషుడనెడు తల్లివేరు జంతువులు పక్షులు ననెడు ఆశ్రితులు శీలము ఆచారము ఆర్యులు అనెడు సుగంధము కలదియు నగు దివ్య పర్వతములు త్రైలోక్యమునెడు నీరు సిద్ధసాధ్యులనెడు జలోర్ములు సువర్ణు (గరుడు) లనెడు వాయువులు యక్షోరగ దైత్యలోక (గణ) మనెడు మహాగ్రాహములు పితామహుడు (బ్రహ్మ) అనెడు మహా ధీరత్వము స్వర్గస్త్రీలనెడు రత్నములు ధీహ్రీ శ్రీ కాంతులనెడు నదులు కాలాంశములు యోగములు మహాపర్వతములు అనెడు ప్రయోగములు (పాటులు పోటులు) ఆత్మయోగమనెడు మహావీర్యము కల ఏకరాట్‌ ధర్మములతో నుండు నారాయణుడను మహాసముద్రమపు; లోక త్రయమును నీచే సృష్టింపబడుచును; లయింపబడును; సర్వయోగులును నీచే బయటికి తేబడి నిన్నే ప్రవేశింతురు; యుగయుగమందును నీవే ప్రళయకాలాగ్ని మేఘరూపుడవగుదువు.
మహాభారావతారాయ దేవ త్వం హి యుగే యుగే| త్వం హి శుక్లః కృతయుగే త్రేతాయాం చమ్పకప్రభః. 28
ద్వాపరే రక్తసఙ్కాశః కృష్ణః కలియుగే భవా& | వైవర్ణ్య మబిధత్సే త్వం ప్రాప్తేషు యుగసన్ధిషు. 29
వైవర్ణ్యం సర్వధర్మాణా ముత్పాయసి వేదవిత్‌| భాసి వాసి ప్రతపసి త్వం చ పాసి విచేష్టసే. 30
క్రుధ్యసి క్షాన్తి మాయాసి త్వం దీపయసి వర్షసి| త్వం హాన్యసి న నిర్యాసి నిర్వాపయసి జాగ్రసి. 31
నిశ్శేషయసి భూతాని కాలో భుత్వా యుగక్షయే| శేష మాత్మాన మాలోక్య విశేషయసి త్వం పునః. 32
కాలో భూత్వా ప్రసన్నాభి రద్భిర్హలాదయసే పునః|
యుగాన్తాగ్న్యవలీడేషు సర్వభూతేషు కిఞ్చన| యాతేషు శేషో భవసి తస్మా చ్ఛేషో 7సి సన్తతమ్‌. 33
చ్యవనోత్పత్తియుక్తేషు బ్రహేన్ద్ర వరుణాదిషు| యస్మాన్న చ్యవసే స్థానా త్తస్మా దచ్యుత ఉచ్యసే. 34
బ్రహ్మణ మిన్ద్రం రుద్రంచ యమం వరుమ మేవచ| నిగృహ్య హరసే యస్మాత్తస్మా ద్ధరి రిహోచ్యసే. 35
సనా (దా) నయసి భూతాని వపుషా యశసా శ్రియా| చిరేణ వపుషా దేవ తస్మా చ్ఛాసి సనాతనః. 36
యస్మాద్బ్రహ్మాదయో దేవా మునయ శ్చేగ్రతేజనః| నతే త్వా మభిగచ్ఛన్తి తేనానన్త స్త్వముచ్యసే. 37
న క్షీయసే న క్షరసే కల్పకోటిశతై రవి| యస్మాత్త్వ మక్షరత్వాచ్చ తస్మా ద్విష్ణుః ప్రకీర్త్యసే. 38
విష్టబ్దం య త్త్వయా సర్వం జగత్థ్సాపరజఙ్గమమ్‌| జగద్విష్టమ్భనా చ్చైవ విష్ణు రేవేతి కీర్త్యసే. 39
విష్టభ్య తిష్ఠసే నిత్యం త్రైలోక్యం సచరాచరమ్‌| యక్షగన్ధర్వ నగరం సుమహాభూతపన్నగమ్‌. 40
వ్యాప్తం త్వయి ప్రవిశతి త్రైలోక్యం సచరాచరమ్‌| తస్మా ద్విష్ణు రితి ప్రోక్త స్స్వయమేవ స్వయమ్భువా.41
దేవా !నీవు యుగయుగమున మహీభారావతారణునకై అవతరింతువు ;కృత త్రేతా ద్వాపర కలియుగములందు వరుసగా శుక్ల(చంపక కుసుమ) హరితరక్త కృష్ణవర్ణుడవు ;ఆయా యుగ సంధుకాలములు వచ్చినపుడు వైవర్ణ్యము నందుదువు ;వేదవేత్తవయి ఆయా కాలములందు సర్వధర్మములకును వైవర్ణ్యము (సాంకర్యము కూడ కలిగింతువు ;నీవే ప్రకాశింతువు వీచెదవు తపింపజేయుదువు రక్షింతువు కృత్యము లాచరింతువు క్రుద్ధుడవగుదువు క్షాంతినందుదువు దీపపింపజేయుదువు వర్షింతువు విడుతువు వెలువడుదువు చల్లార్చెదవు మేలుకొందువు; యుగక్షయమున కాలుడయి సకల భూతములను నిఃశేషమొనరింతువు ;అదే కాలరూపుడవై తేటయగు నీటితో ఆనందపరచెదవు ;సర్వభూతములును యుగాంతాగ్నిచే నాకివేయ (దహించ) బడగా అన్నియు పోగా నీవే శేషింతువు ;కనుకనే సంతతమును శేషుడవనబడెదవు ;శేషించిన ఆత్మను (నీ స్వస్వరూపమును చూచికొని మరల విషేష (భేద) మును నీ రూపమునందును కలిగించుకొందువు; ఈ హేతువుచేతను నీవు (వి) శేషుడవు ;బ్రహ్మేంద్ర పరుణాదులు చ్యవనము (చ్యుతి- నాశము) ఉత్పత్తి కలవారు. నీవు మాత్రము స్థానమునుండి చ్యుతుడవుకావు. కనుక అచ్యుతుడవు. బ్రహ్మేంద్ర రుద్ర యమ వరుణులను గూడ నిగ్రహించి హరింతువుకావున హరివి. సనా (ఎల్లపుడు) భూతములను శరీరకీర్తి శ్రీలతో కూర్చుచు నీవు చిరస్థాయి వపుపు (శరీరము)తో కూడియుందువు. కావున నీవు 'సనా( దా) తనుడు' (ఎల్లపుడు ఉండువాడు) అయితివి. బ్రహ్మాది దేవతలును ఉగ్ర తేజస్కులగు మునులును నిన్ను అందుకొనజాలరు. కావున అనంతుడవు (అంత- అంతికము- సమీపము- నకు వచ్చుట) శతకోటి కల్పములకయిన నీవు క్షయించవు- క్షరించవు- (కరుగవు- తరుగవు) కావున అక్షరుడవు, స్థావర జంగమాత్మక జగత్తును విష్టబ్ధము (నిలుపపబడినదిగా) చేయుదువు. కావున సచరాచర త్రైలోక్యమును విష్టంభించి (ఆశ్రముగా చేసికొని) ఉందువు- యక్ష గంధర్వ నగరములతో మహాభూత నాగులతో నిండిన సచారాచర త్రైలోక్యమువును వ్యాప్తమయి నీయందు ప్రవేశించియున్నది కావున నీవు విష్ణుడవు( విశంతి సర్వభూతాని ఏనం- విశంతి సర్వభూతాని అయమ్‌) 'సర్వభూతములును ఇతనియందు ప్రవేశించును. సర్వభూతములందు ఇతడు ప్రవేశించును 'అని స్వయంభువు చెప్పెను.
నారా ఇత్యుచ్యంతే హ్యాపో ఋషిభి స్తత్త్వ దర్శిభిః | ఆయనం తస్య తాః పూర్వం తేన నారాయణ స్స్మృతః. 42
యుగే యుగే ప్రణష్టాం గాం విష్ణో విన్దసి తత్త్వతః| గోవిన్దేతి తతో నామ్నా ప్రోచ్యసే ఋషిభిస్తథా. 43
హృషీకాణీన్ద్రి యాణ్యాహు స్తత్త్వజ్ఞాన విశారదాః| ఈశత్వే వర్తసే తేషాం హృషీకేశ స్తథోచ్యసే. 44
వసన్తి త్వయి భూతాని బ్రహ్మాదీని యుగక్షయే | త్వం వా వససి భూతేషు వాసుదేవ స్తథోచ్యసే. 45
సఙ్కర్షయసి భూతాని కల్పే కల్పే పునః పునః | తత స్సఙ్కర్షణః ప్రోక్త స్తత్త్వవిజ్ఞావిశారదైః. 46
ప్రతిప్యూహేన తిష్ఠన్తి సదేవారసురాక్షసాః| ప్రవిద్యు స్సర్వధర్మాణాం ప్రద్యుమ్న స్తేన చోచ్యసే. 47
నిరోద్ధా విద్యతే యస్మా న్న తే భూతేషు కశ్చన| అనిరుద్ధ స్తతః ప్రోక్తః పూర్వమేవ మహర్షిభిః. 48
యత్త్వయా ధార్యతే విశ్వం త్వయా సంహ్రియతే జగత్‌| త్వం ధారయసి భూతాని భువనం త్వం బిభర్షి చ. 49
యత్త్వయా ధార్యతే కిఞ్చి త్తేజసా చ బలేన వా| మయా హి ధార్యతే పస్చా న్నాధృతం ధార్యతే త్వయా. 50
న హి తద్విద్యతే భూతం త్వయా య న్నాత్ర ధార్యతే| త్వమేవ కురుషే దేవ నారాయమ యుగే యుగే . 51
మహీభారావతరణం జగతో హితకామ్యయా | తవైవ తేజసా క్రాన్తాం రసాతలతలం గతామ్‌. 52
త్రాయస్వం మాం సురశ్రేష్ఠ త్వామేవ శరణం గతా| దానవైః పీడ్యమానా హం రాక్షసైః క్రోధతత్పరైః. 53
త్వామేవ శరణం నిత్య ముపయామి సనాతనమ్‌| తావన్మే7స్తి భయం దేవ యావ న్న త్వాం క కుద్మినమ్‌. 54
శరణం యామి మనసా శతశో7ప్యు పలక్షయే | ఉపమానం న తే శక్తాః కర్తుం సేన్ద్రా దివౌకసః. 55
త్వమేవ సతతం వేత్సి నిరుత్తర మతః పరమ్‌|
తత్త్వదర్శులగు ఋషులు అప్పు( జలము) లను 'నారములు' అందురు; (సృష్టికి) పూర్వమతనికవి అయనము (ఆశ్రయ- లయ- స్థానము) కావున నారాయణుడవు ; యుగయుగమునందును ప్రణాశమందిన గోవును (ధర్మమును- భూమిని- నన్ను) తాత్త్వికముగా యథాస్థితిని పొందింతువు; (గో-విద్‌) కావున నీవు ఋషులచే గోవిందుడనబడెదవు; తత్త్వజ్ఞాన విశారదులు ఇంద్రియములు హృషీకరములందురు ; వానికి ఈశుడవైవర్తిల్లుదువు కావున హృషీకేశుడవు;యుగక్షయమందును బ్రహ్మాది భూతములు నీ యందు వసించును; నీవును వానియందు వసింతువు; కావున సంకర్షణుడవు అని తత్త్వజ్ఞాన విశారదులందురు; దేవాసుర రాక్షసులు ప్రతివ్యూహము (అమరిక)తో నీ బలముననే యున్నారు; సర్వధర్మ ముల తత్త్వములను ఎరుగుచున్నారు ; కావున (ప్ర-దివ్‌: ప్ర-విద్‌) ప్రద్యుమ్నుడవు; భూతములయందు ఏయొకడును ఇతని కంటెమించి నిరోధము (ఆటంకము) ఒనరించువాడు (తన అదుపునందుంచుకొవాడు) లేడు కావున మహర్షులచే అనిరుద్ధడన బడెదవు; విశ్వము నీచే ధరించబడును; సంహరించబడును; నీవు భూతములను ధరింతువు - భువనమును భరింతువు ఏ కొంచె(తత్త్వ)మయినను తేజముచే కాని బలముచేకాని మొదట నీచే ధరించబడును ; తరువాత నాచే ధరించబడును; నీచే ధరించబడనిదే నాచే ధరించబడదు; ఈ విశ్వమందు నీ చేత ధరించబడనిది ఏదియు లేదు; నారాయణా! యుగయుగమునను జగములకు హితముచేయు కామనచో నీవే మహీభారమనవతరించ(దిగునట్లు) చేయుదువు; నీ తేజస్సుతోనే ఆక్రాంతికై (వ్యాప్తికై) రసాతలతలమును చేరియున్న నన్ను రక్షించుము; సురశ్రేష్ఠా! నిన్నే శరణందితిని; క్రోధతత్పరులగు దానవులచే రాక్షసులచే పీడింపబడుచున్న నేను సనాతనుడవగు నిన్నే శరణు పొందుచున్నాను: కకుద్మి (దేవవృషభుడు) అగు నిన్ను మనసా శరణందనంతవరకు నాకు భయము ఉండనేయున్నది. నూరు విధములుగా ఆలోచించినను నీకు ఉపమానము నాకు కనబడుట లేదు. ఇంద్రాది దేవతలును నిన్నెవరితోను పోల్చుటకును శక్తులు కారు. ఎల్లపుడును ఈ విషయము లన్నియు నీవే ఎరుగుదువు. ఇక మీదట (ఇంతకు మించి) పైగా చెప్పవలసినది ఏమియు లేదు.

శార్‌జ్‌ఞ్గచక్రధారియగు భగవానుడు హరి పృథివియందు ప్రీతుడై ఆమె కామములను యథాకామముగ పూరించెను. అంతే కాక -మహాదేవి మాధవుని ఈ స్తవోత్తమమును మనస్సున ధరించు మర్త్యుడు పరాభవమునందడు; నిష్కల్మములగు వైష్ణవ లోకములనందును. అపురుషుడు వేదముల నధ్యయనము చేసినంతటి వాడును ప్రీతిచిత్తుడును మునియంతటి వాడునగును. ఏలయన ఈ మాధవీయస్తవోత్తమము మహాశ్చర్యకర విషయ సర్వస్వము.

శ్రీ మత్స్య మహాపురాణమున వారాహావతార చరితమున ధరణీ సముద్ధరణమను రెండు వందల నలువది ఏడవ అధ్యాయము నుండి.

Monday, March 30, 2020

శ్రీ బ్రహ్మకృత శ్రీ వామనమూర్తి స్తుతిః

శ్రీ బ్రహ్మకృత శ్రీ వామనమూర్తి స్తుతిః



జయాద్యేశ జయాజేయ జయ సర్వాత్మకాత్మక |
జయ జన్మజరాపోత జయానన్త జయాచ్యుత. 68
జయాజిత జయామేయ జయావ్యక్తస్థితే జయ | పరమార్థార్థసర్వజ్ఞ జ్ఞానజ్ఞేయాత్మ నిస్సృత. 69
జయాశేషజగత్సాక్షి న్జత్కర్త ర్జగద్గురో | జగతో7స్యాన్తకృద్దేవ స్థితిం పాలయితుం జయ. 70
జయాశేష జయాశేష జయాఖిలహృది స్థిత | జయాదిమధ్యాన్త జయ సర్వజ్ఞాననిధే జయ. 71
ముముక్షుభినిర్దేశ్య స్వయం హృష్టజనేశ్వర | యోగినాం ముక్తిఫలద దమాదిగుణభూషణ. 72
జయాతిసూక్ష్మ దుజ్ఞేఞయ జయ స్థూలజగన్మయ | జయస్థూలాతిసూక్ష్మ త్వం జయాతీన్ద్రియ సేన్ద్రియ. 73
జయ స్వమాయాయోగస్థ శేషభోగశయాక్షర | జయైకదంష్ట్రా ప్రాన్తాగ్రసముద్దృత వసున్ధర. 74
నృకేసర న్జయారాతి వక్షస్థ్సల విదారణ | సామ్ప్రతం జయ విశ్వాత్మ న్జయ వామన కేశవ. 75
నిజమాయాపటచ్ఛన్న జగన్మూర్తే జనార్ధన | జయాజిత జయానేక స్వరూపైకవిధ ప్రభో. 76
వర్ధస్వ వర్ధితాశేషవికారప్రకృతే హరే | త్వయ్యేషా జగతా మీశే సంస్థితా ధర్మపద్ధతిః. 77
న త్వామహం న చేశానో నేన్ద్రాద్యా స్త్రిదశా హరే | న జ్ఞాతు మీశా మునయ స్సనకాద్యా న యోగినః. 78
త్వన్మాయాపటసంవీతే జగత్యత్ర జగత్పతే | కస్త్వాం వేత్స్యతి సర్వేశ త్వత్ప్రసాదం వినా నరః. 79
త్వమేవారాధితో యేన ప్రసాదసుముఖః ప్రభో | స ఏకః కేవలో దేవ వేత్తి త్వాం నేతరే జనాః. 80
నన్దీశ్వరేశ్వరేశాన ప్రభో వర్ధస్వ వామన | ప్రభవాయాస్య విశ్వస్య విశ్వాత్మ న్పృథులోచన. 81


భగవానుడగు గోవిందుడు వామనాకృతియై జనించెను; సర్వామరేశ్వరుడగు ఆ జగన్నాథుడవతరించ గనే దేవతలును తన్మాతయగు అదితియు దుఃఖముక్తులయిరి; సుఖస్పర్శ వాయువులు వీచెను; గగనము నిర్మలయ్యెను; సర్వభూతములకు ధర్మమందాసక్తి కలిగెను; అసురులకును భూమ్యంతరిక్ష ద్యులోకవాసులకును తదాదిగా ఉద్వేగము తగ్గెను; అతడు జనించినంతనే లోక పితామహుడగు బ్రహ్మ అతనికి జాతకర్మాదికము జరిపి అతనిని దర్శించి ఋషులు వినుచుండ ఆ దేవదేవేశునిట్లు స్తుతించెనుజయజయ ఆద్యా! ఈశా! అజేయా! సర్వాత్మకాత్మకా! జన్మజరారహితా! అనంతా! అచ్యుతా! అజితా! అమేయా! అవ్యక్తస్థితి! పరమార్థవస్తురూపా! సర్వజ్ఞా! జ్ఞాతృజ్ఞానజ్ఞేయరూపా! స్వయంభూరుపా! అశేష జగత్సాక్షిన్‌! జగత్కార్తా! జగద్దురూ! జగత్థ్సితిలయకరా! జగత్పాలకా! శేషా! శేషా! అశేషా! అఖిల హృదయావాసా! ఆదిమధ్యాంతరూపా! సర్వజ్ఞానవిధీ! ముముక్షువులును ఇట్టివాడవని నిర్దేశింపనలవికాని దేవా! ఆత్మతృప్తా ! జనేశ్వరా! యోగిముక్తి ఫల ప్రదా! దమాది గుణవిభూషణా !
అతిసూక్ష్మ! దుజ్ఞేయా! స్థూలజగన్మాయా! అతీంద్రియా! సేంద్రియా! మాయాయోగస్థితా! శేషభోగశయనా! అక్షరా! ఒకకోరకొనతోనే వసుంధరను పైకెత్తినవాడా! నృసింహా; శత్రువక్షఃస్థల విదారణా! విశ్వాత్మన్‌! వామనా! కేశవా! స్వమాయా వస్త్రాచ్ఛాదితజన్మూర్తీ! జనార్ధనా! అనేక రూపా! ఏకరూపా! ప్రభూ! వర్థిల్లుము వర్ధితాశేష వికారయుత ప్రకృతీ! హరీ! జగదీశుడవగు నీయందే ధర్మ మార్గము నిలిచియున్నది నేను కాని రుద్రుడు కాని ఇంద్రాది దేవతలు కాని మునులును సనకాది యోగులునుకాని నిన్నెరుగజాలరు. జగత్పతీ! నీమాయయను వస్త్రముతో కప్పుపడిన ఈజగమందు సర్వేశా! నీ యనుగ్రహమందక ఎవడు నిన్నెరుగును నిన్నారాధించి ప్రసాద సుముఖునిగా చేసి కొనినవారు మాత్రమే కాక ఇతరులు నిన్నెరుగజాలరు;
నందీశ్వరేశ్వరా! ఈశానా! ప్రభూ! వామనా: విశ్వాత్మన్‌! విశాల లోచనా! ఈ జగదభ్యుదయమునకై వర్ధిల్లుము.


శ్రీ మత్స్య మహాపురాణమున వామన చరిత్రమున వామన మూర్త్యవతారమను రెండు వందల నలుబది నాల్గవ అధ్యాయమ నుండి.

ప్రహ్లాద చెప్పిన శ్రీ విష్ణుమహిమా

ప్రహ్లాద చెప్పిన శ్రీ విష్ణుమహిమా




తేజసో హాని రుత్పన్నా తచ్ఛృణుష్య యథార్థతః | దేవదేవో జగద్యోని రయోని ర్జగదాదికృత్‌. 17
అనాది రాదిర్విశ్వస్య వరేణ్యో వరదో హరిః | పరమ్పరాణాం పరమం పరః పరవతామపి. 18
ప్రమాణంచ ప్రమాణానాం సప్తలోకగురో ర్గురుః |
ప్రభుః ప్రభూణాం పరమే మహాత్మా అనాదిమధ్యో భగవా ననన్తః. 19
త్రైలోక్య మంశేన సనాథ మేష కర్తుం మహాత్మా7దితిజో7వతీర్ణః |
న యస్య రుద్రో న చ పద్మయోని రిన్ద్రో న సూర్యేన్దు మరీచిముఖ్యాః. 20
జానన్తి దైత్యాధిప యత్స్వరూపం స వాసుదేవః కలయా7వతీర్ణః |
యో7సౌ కలాంశేన నృసింహరూపీ జఘాన పూర్వం పితరం మమేశః 21
య స్సర్వయోగీశమనోనివాస స్స వాసుదేవః కలయా7వతీర్ణః |
యమక్షరం వేదవిదో విదిత్వా విశన్తి యం జ్ఞానవిధూతపాపాః. 22
యస్మి న్ప్రవిష్టా న పునర్భవన్తి తం వాసుదేవం ప్రణమామి నిత్యమ్‌ |
భూతా న్యశేషాణి యతో భవన్తి యథోర్మయ స్తోయనిధే రజస్రమ్‌. 23
లయం చ యస్మి న్ప్రళ##యే ప్రయాన్తిం తం వాసుదేవం ప్రణమామ్యజస్రమ్‌ |
న యస్య రూపం న బలప్రభావౌ న యస్య భావః పరమస్య పుంసః. 24
విజ్ఞాయతే శర్వపితామహాద్యై స్తం వాసుదేవం ప్రణమామ్యజస్రమ్‌ |
రూపస్య చక్షుర్గ్రహణ త్వగిష్టా స్పర్శే గ్రహిత్రీ రసవా రసస్య. 25
శ్రోత్రంచ శబ్దగ్రహణ నరాణాం ఘ్రాణంచ గన్ధగ్రహణ నియుక్తమే | సఘ్రాణగ్రాహ్యశ్శ్రవణాదిభి ర్య స్సర్వేశ్వరో వేదితు మక్షయాత్మా. 26
శక్య స్త మీడ్యం మనసైవ దేవం గ్రాహ్యం తతో7హం హరి మీశితారమ్‌| యేనైకదంష్ట్రాగ్ర సముద్ధృతేయం ధరా చ తాం ధారయతీహ సర్వా& . 27
యస్మింశ్చ శేతే సకలం జగచ్ఛ తమాద్యమీశం ప్రమతో7స్మి విష్ణుమ్‌ |
అంశావతీర్ణేన చ యేన గర్భే హృతాని తేజాంసి మహాసురాణామ్‌. 28
నమామి తం దేవ మజస్ర మీశ మశేషసంసారతరోః కుఠారమ్‌ |
దేవో జగద్యోని రయం మహాత్మా స షోడశాంశేన మహాసురేన్ద్ర.29
స దేవమాతు ర్జఠరం ప్రవిష్ణో హృతాని వ స్తేన బలా ద్వపూంషి|


దేవదేవుడును జగత్కారణుడును తనజన్మకు కారణమగునది లేనివాడును జగదాది కర్తయు అనాదియు విశ్వమున కాదియు వరేణ్యుడు( శ్రేష్ఠుడు- ప్రార్థనీయుడు) ను వరదుడును హరియు (పాపములను హరించువాడును) గొప్పవాని యన్నింటిలో గొప్పవాడును గొప్పవారికిని గొప్పవాడును ప్రమాణములకును ప్రమాణభూతుడును సప్తలోకగురుడు (తండ్రి) అగు బ్రహ్మకును తండ్రియు ప్రభులకును పరమ ప్రభువును మహాత్ముడును ఆదిమధ్యాంతరహితుడును భగవాముడును అగు మహాత్ముడీ విష్ణువు త్రైలోక్యమును సనాధము (రక్షణకలది) గా చేయుటకై అంశముతో అదితి గర్భమునందవతరించినాడు; రుద్రబ్రహ్మేంద్ర రవీందులకును మరీచ్యాది ప్రజాపతులకును అతని స్వరూపమెరుగరానిది; తన కలాంశముతో నృసింహ రూపుడై మునుపు మా తండ్రిని చంపిన ఈశుడు సర్వయోగీశ మనోనివాసుడునగు వాసుదేవుడీతడు; వేదతత్త్వవిదు లీయక్షరునెరిగి జ్ఞానబలమున తమ పాపములు పోద్రోలి అతనియందే లయమందుదురు; వారు మరల జన్మించరు; అట్టి వాసుదేవుని నమస్కరింతును; సముద్రమునుండి అలలువలె అతనినుండియే సమస్త భూతములునతని నుండి జనించి ప్రళయముననతనియందే లయమందును; రుద్ర బ్రహ్మాదులును ఆ పరమపురుషుని రూప బల ప్రభావ భవముల నెరుగజాలరు; రూప స్పర్శ రస శబ్ద గంధ గ్రహులగు చక్షుస్త్వక్‌ జిహ్వాశ్రోత్రఘ్రాణములును అతనిని గ్రహింపజాలవు; అట్టి స్తవనీయుడును మనోమాత్ర గ్రాహ్యుడును ఈశ్వరుడునునగు హరిని వాసుదేవుని నమస్కరింతును; తన ఏకదంష్ట్రాగ్రముతో నతడు భూమిని ధరించినందుననే ఆ దేవియు ఈ సర్వభూతములను ధరించగలుగుచున్నది; ఈ సకల జగము నాతనియందే శయనించియున్నది; అట్టిహరి అంశావతారమెత్తి దైత్యతేజములకు హానికలిగించినాడు; సంసార వృక్షకుఠారుడగు ఆ దేవుని నేను అజస్రమును నమస్కరించుచుందును. మహాత్ముడగు ఆదేవుడు జగత్కారణుడు. మహా7సురేంద్ర! అతడు తన పదునారవ అంశముతో దేవమాతృగర్భమున ప్రవేశించినందున నతని బలముచే దైత్య శరీరతేజస్సులు హరింపబడినవి.


శ్రీ మత్స్య మహాపురాణమున వామన చరిత్రమున వామన మూర్త్యవతారమను రెండు వందల నలుబది నాల్గవ అధ్యాయమ నుండి.

అదితికృత వాసుదేవ స్తుతిః.

అదితికృత వాసుదేవ స్తుతిః


నమస్స్మృతార్తినాశాయ నమః పుష్కరమాలినే. 13
నమః పరమకల్యాణి కల్యాణాయా దివేధసే| నమః వఙ్కజనేత్రాయ నమః పహ్కజనాభయే. 14
నమః పఙ్కజనమ్భూతి సమ్భవాయాత్మయోనయో| కాన్తాయ దాన్తదృశ్యాయ పరమార్థా చక్రిణ. 15
నమ శ్శఙ్ఖాసిహస్తాయ నమః కనకరేతసే| తథా త్మజ్ఞాన విజ్ఞానయోగినా చిన్త్యాత్మయోగినే. 16
నిర్గుణాయ విశేషాయ హరయే బహ్రహ్మరూపిణ| జగత్ప్రతిష్ఠితం యత్ర జగతా యో న దృస్యతే. 17
నమస్థ్సూ లాతిసూక్ష్మాయ తసై#్మ దేవాయ శఙ్కినే| యం న పశ్యన్తి పస్యన్తో జగదప్యఖిలం నరాః. 18
అపశ్యద్భి ర్జగద్చయత్ర దృశ్యతే హృది సంస్థితః| యస్మన్నన్నం పయశైవ సద్యశ్చైవాఖిలం జగత్‌. 19
తసై#్మ నమోస్తు జగతా మాధారాయ నమోనమః| ఆద్యః ప్రజారపతి ర్యశ్చ యః పితౄణాం పరః పతిః. 20
పతిస్సురాణాం యస్త సై#్మ నమః కృష్ణాయ వేధసే| యః ప్రవృత్తౌ నివృత్తౌ చ ఇజ్యతే కర్మభి స్స్వకై. 21
స్వర్గాపవర్గఫలదో నమ స్తసై#్మ గదాభృతే | యశ్చిన్త్యమానో మనసా సద్యః పాపం వ్యపోహతి. 22
నమస్తసై#్మ విశుద్ధాయపరాయ హరిమేధసే| యం బుధ్ధ్వా సర్వబూతాని దేవదేవేశ మవ్యయమ్‌. 23
న పునర్జన్మమరణ ప్రాప్నువన్తి నమామి తమ్‌| యో యజ్ఞే యజ్ఞపరమై రిజ్యతే యజ్ఞసంజ్ఞితః. 24
తం యజ్ఞపురుషం విష్ణుం నమామి ప్రభు మీశ్వరమ్‌|
స్మరించిన వారి ఆర్తి నశింపజేయువాడును పద్మమాలియు పరమ కల్యాణి కల్యాణుడును ఆది బ్రహ్మరూపుడును పంకజనేత్రుడును పంకజనాభుడును పద్మసంభవుని జన్మకారణుడును ఆత్మయోనియు మనోహర రూపుడును ఇంద్రియ నిగ్రహము కలవాడును దృస్య జగద్రూపుడు పరమార్థ రూపుడు చక్రియు శంఖ ఖడ్గహస్తుడు హరిణ్యరేతస్కుడు ఆత్మ జ్ఞానముగల యోగులచే చింతింపడువాడు స్వయం యోగియు నిర్గుణుడు విశేష రూపుడు హరియు పరబ్రహ్మరూపుడు నగు హరికి నమస్కారము. ఎవనియందు జగము ప్రతిష్ఠితమో జగమునకు ఎవడు కనబడడో అట్టి అతి సూక్ష్మునకు అతి స్థూలునకు శంఖికి నమస్కారము; అఖిల జగమును చూచుచుండియు బహిర్ముఖలగు జనులెవనిని చూడజాలరో ఇందుండియు ఈ జగమును బహిర్ముఖ దృష్టితో చూడని యోగులు ఎవనిని తమ హృదయముందేయున్న వానిగా చూతురో ఎవనియందన్నము జలము నదులు సమస్త జగములు ఉన్నదో అట్టి జగదాధారునకు నమస్కారము; ఆద్య ప్రజాపతియు పితరులకును పరమపతి(పిత) యు దేవతాపతియునగు కృష్ణునకు వేదో (చతుర్ముఖ బ్రహ్మ) రూపునకు నమస్కారము. ఎవడు ప్రవృత్తి మార్గములందాయా కర్మములతే ఆరాధింపడునో అట్టి స్వర్గాపవర్గ ఫరదుడగు గదాధారికి నమస్కారము; మనస్సుతో చింతించినంతనే పాపము హరించు విశుద్ధుడు పరుడునగు హరికి వేధకు (సృష్టికర్తకు) నమస్సు; సర్వభూతములును దేవదేవేశుడు నవ్యయుడునగు ఎవని నెరిగినంతనే జన్మ మరణరహితులగుదురో(నో) ఆ హరిని నమస్కరింతును; యజ్ఞ పరాయణులు యజ్ఞమందు ఎవనిని యజ్ఞుడను పేర ఆరాధింతురో అట్టి యజ్ఞపురుషుని విష్ణుని ప్రభుని ఈశ్వరుని నమస్కరింతును.
గీయతే సర్వవేదేషు వేదవిద్భి ర్విదాంపతిః. 25
యస్తసై#్మ వేదవేద్యాయ విష్ణవే జిష్ణవే నమః| యతో విశ్వం సముత్పన్నం యస్మింశ్చ లయ మేష్యతి. 26
విశ్వోద్భవప్రతిష్ఠాయ సమస్తసై#్మ మహాత్మనే| బ్రహ్మాది స్తమ్బపర్యన్తం యేన విశ్వమిదం తతమ్‌. 27
మాయాజాలం సముత్తర్తుం తముపేన్ద్రం న మా మ్యహమ్‌| విషాదతోషరోషాద్యైర్యో జస్రం సుఖదుఃఖజైః. 28
నృత్యత్యఖిలభూతస్థ స్తముపేన్ద్రం నమా మ్యహమ్‌| యమారాధ్య విశుద్ధేన కర్మణా మనసా గిరా. 29
తరస్త్యవిద్యా మఖిలాం తముపేన్ద్రం నమా మ్యహమ్‌| యస్త్సుతో విశ్వరూపస్థో బిభర్త్యఖిల మీశ్వరః. 30
విశ్వం విశ్వపతిం విష్ణుం తం నమామి ప్రజాపతిమ్‌| మూర్త న్తమో సురమయం
తద్వధాద్వినిహన్తి యః. 31
రాత్రిజం సూర్యరూపీవ తముపేన్ద్రం నమా మ్యహమ్‌| కపిలాదజి స్వరూపస్థో యశ్చాజ్ఞానయమం తమః. 32
హన్తి జ్ఞానప్రదానేన తముపేన్ద్రం నమా మ్యహమ్‌| యస్యాక్షిణీ తన్ద్రసూర్యౌ సర్వలోక శుభఙ్కరమ్‌. 33
వస్యతః కర్మ సతతం తముపేన్ద్రం నమా మ్యహమ్‌| యస్మిన్త్సర్వేశ్వరే విశేవం సత్య మేతన్మయోదితమ్‌. 34
నానృతం త మజం విష్ణుం నమామి ప్రబు మవ్యయమ్‌| యథైత త్సత్యముక్తంచ భూయాంశ్చాతో జనార్దనః. 35
సత్యేన తేన సఫలాః పూర్యన్తాం మే మనోరథాః.
సర్వజ్ఞుడగు ఎవడు వేదవేత్తలచే సర్వ వేదములందును గానము చేయబడునో వేదవేద్యుడగు అట్టి విష్ణునకు జిష్ణునకు నమస్కారము; ఎవనినుండి విశ్వముత్పన్నమయి ఎవనియందు లయమందునో విశ్వపురాకకు నిలుకడకు కారణ భూతుడగు అట్టి మహాత్మునకు నమస్కారము; బ్రహ్మాది స్తంబ పర్యంతమగు ఈ విశ్వమేవనిచే వ్యాప్తమో అట్టి యుపేంద్రుని నేను ఈ మాయాజాలము తరించుటకై నమస్కరింతును; తోయ స్వరూపుడై యుండి అఖిలమును పోషించు విశ్వుని విశ్వపతిని ప్రజాపతిని విష్ణుని నమస్కరింతును; సుఖదుఃఖములకు హేతువులగు విషాద సంతోష రోషాదులకు అజేయుడును అఖిల భూతాంతర్యామియయి వర్తించువాడు నగు ఉపేంద్రునకు వందనము ;రాత్రులందేర్పుడు చీకటిని రవివలె అసురమయమగు రూపొందిన చీకటిని వదించి నశింపచేయు ఉపేంద్రుని నమస్కరింతును ;కపిలాది యోగి స్వరూపమునుండి అజ్ఞానమయతమమున జ్ఞాన ప్రకాశ ప్రదానమున నశింపజేయు హరిని నమస్కరింతునుఎవని నేత్రములగు చంద్రసూర్యులు సర్వలోక శుభకరమగు కర్మమున సతతము చూచుచున్నారో అట్టి యుపేంద్రుని నమస్కరింతును; సర్వేశ్వరుడును సర్వుడునునగు ఎవనియందు నేను చెప్పిన ఇది యంతయు సత్యమో అసత్యము కాదో అట్టి అజుని విష్ణుని ప్రభుని అవ్యముని నమస్కరింతునునేను చెప్పిన ఇదియంతయు సత్యము కావునను జనార్ధనుడింతకంటెను అధికుడు కావునను ఈ సత్యముచే నా మనోరథములన్నియు సఫలములయి పూరింపపడుగాక !

శ్రీ మత్స్య మహాపురాణమున వామన చరితమున అదితి గర్భముందు హరిప్రవేశమను రెండు వందల నలువది మూడవ అధ్యాయము నుండి.