Friday, April 3, 2020

దేవదానవ కృత శ్రీ విష్ణుస్తుతిః.

దేవదానవ కృత శ్రీ విష్ణుస్తుతిః.


నమో లోకత్రయాధ్యక్ష తేజసా జితభాస్కర. 38
నమో విష్ణో నమో జిష్ణో నమస్తే కైటభార్దన | నమ స్సర్గక్రియాకర్త్రే జగత్పాలయతే నమః. 39
రుద్రరూపాయ శర్వాయ నమ స్సంహారకారిణ | నమ శ్శూలాయుధాధృష్య నమో దానవఘాతినే. 40
నమః క్రమత్రయా క్రాన్త త్రైలోక్యాయాభవాయచ నమః| ప్రచణ్డదైత్యేన్ద్ర తూలకాలమహానల. 41
నమో నాభిహ్రదోద్భూత పద్మగర్భ మహాచల| పద్మబూత మహాభూతకర్త్రే హర్త్రే జగత్ప్రియ. 42
జనితా శేషలోకేశ క్రియాకారణకారిణ| అమరారివినాశాయ మహాసమరశాలినే. 43
లక్ష్మీ ముఖాబ్జమధుప నమః కీర్తినివాసినే| అస్మాక మమరత్వాయ ధ్రియతాం ధ్రియతా మయమ్‌. 44
మన్దర స్సర్వశైలానా మయుతాయుతవస్తరః| అనన్తబల బాహుభ్యా మవష్టభ్యైకపాణినా. 45
మథ్యతా మమృతం దేవ స్వథాస్వాహార్థకామినామ్‌| తత శ్శ్రుత్వా న భగవా & స్తోత్రం పూర్వం వచ స్తదా. 46

విహాయ యోగనిద్రాం తా మువాచ మధుసూదనః| శ్రీ భగవా& : స్వాగతం విబుధా స్సర్వే కి మాగమన కారణమ్‌. 47
యస్మా త్కార్య దిహ ప్రాప్తా స్తద్బ్రూత విగతజ్వరాః| నారాయణ నైవ ముక్తాః ప్రోచు స్తత్ర దివౌకసః. 48
అమరత్వా య దేవేశః మథ్యఘానే మహోదధౌ| యథామృతత్వం దేవేశ తథా నః కురు మాధవ. 49
త్వయా వినా న త చ్ఛక్య మాస్మాభిః కైటభార్దన| ప్రాప్తుం త దమృతం నాథ తతో గ్రే భవ నో విభో. 50
లోకత్రయాధ్యక్షా ! తేజోజిత భాస్కరా ! విష్ణో! జిష్ణో! కైటభమర్ధనా ! సృష్టిక్రియాకర్తా ! జగత్పాలయితా ! నమస్కారము; రుద్రరూపా ! శర్వా! సంహారకారిన్‌! శూలాయుధా! అధృష్యా! దానవఘాతిన్‌ !నమస్కారము ; పాదత్రయక్రమాక్రాంత త్రైలోక్యా! అభవా!ప్రచండదైత్యంద్రతూల ప్రళయ మహాగ్నీ ! నా భిహ్రద సంజాత పద్మగర్భ మహాచలా ! పద్మభూతా మహాభూతా! (పాద్మకల్పమున పృథ్వీ మహాభూతమునారాయణుని నాభి పద్మమని చెప్పబడెను.) కర్తా!హర్తా!జగత్ప్రియా!అసేష లోకపాల జనకా!క్రియాకారణ కారిన్‌!దేవారి వినాశకా! మహాసమరసాలిన్‌ ;లక్ష్మీ ముఖ పద్మ మధుపా !కీర్తినివాసిన్‌!నమస్కారము; మాకు అమరత్వము కలిగింప నిశ్చయించుము ;సర్వ శైలములలో గొప్పదియు అయుతాయుత యోజన విస్తామునునగు ఈ మందరమును నీ అనంత బలబాహుద్వయమందలి ఒక బాహువుతో ఒక పాణితో నిలువబెట్టి ధరించుము ;స్వధాస్వాహార్థహవిః కాములగు దేవతలకై అమృతమును మథించవలయును ;
అనిన స్తోత్ర పూర్వక దేవవచనమును విని మదుసూదనుడు యోగనిద్ర విడిచి ఇట్లనెను : సర్వదేవతలారా! స్వాగతము; మీ ఆగమన కారణమి? మనః సంతాపము విడిచి మీరు వచ్చిన పని తెలుపుడు; అట నారాయణుడిట్లు పలుకగ విని దివౌకసులిట్లనిరి ;దేవేశా! మాకమరత్వ ప్రాప్తికై చేయు ఈ మహోదధి మథనముచే మా కది లభించు నుపాయమొన రింపుము; మాధవా! కైటభమర్దనా!విభూ!నీవు లేనిదే మాచే ఆ అమృతము పొంద శక్యముకాదు ;కావున నీవు మా ముందుడుము.

శ్రీ మత్స్య మహాపురాణమున దేవదానవులు అమృతమునకై క్షీరసాగరమును మథించుటయను రెండు వందల నలువది ఎనిమిదవ యధ్యాయము నుండి.